ఉరుకుల పరుగుల జీవితంలో శరీరంలో కొలెస్ట్రాల్ సమస్య పెను ప్రమాదకరంగా మారుతోంది.. కొలెస్ట్రాల్ ఆరోగ్యాన్ని దెబ్బతీసి ప్రమాదకర జబ్బుల బారిన పడేలా చేస్తోంది.. అందుకే వైద్య నిపుణులు దీనిని సైలెంట్ కిల్లర్ అంటారు.. ఇది గుండె వ్యాధులు, అధిక రక్తపోటు, స్ట్రోక్ కు కారణమవుతుంది. శరీరంలో కొవ్వును నియంత్రించేందుకు జీవనశైలిని.. ఆహారాన్ని మార్చుకోవడం చాలా ముఖ్యం.. వాస్తవానికి కొలెస్ట్రాల్ ను రెండు రకాలుగా విభజిస్తారు.. అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL) అంటే మంచి కొలెస్ట్రాల్.. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) అంటే చెడు కొలెస్ట్రాల్ గా పేర్కొంటారు.. అయితే.. హృద్రోగులకు అధిక కొలెస్ట్రాల్ అతిపెద్ద ప్రమాదం.. సిరల్లో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటే అది దీర్ఘకాలికంగా ప్రాణాంతకం కావచ్చు.
లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష ద్వారా, మీ ధమనులలో ఎంత మేర కొలెస్ట్రాల్ అడ్డంకులు ఉన్నాయో మీరు తెలుసుకోవచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం.. అయితే.. ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. వంటగదిలో ఉంచిన వస్తువులను తినడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు.. కొలెస్ట్రాల్ నియంత్రణకు ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి.. ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి