Heart Attack: గుండెపోటు వచ్చే అరగంట ముందు శరీరంలో కనిపించే మార్పులివే..

|

Apr 04, 2024 | 8:09 PM

అయితే గుండెపోటు బారిన పడడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. జీవనవిధానంలో మార్పులు, తీసుకునే ఆహారం సరిగ్గా లేకపోవడం, శారీరకశ్రమ తగ్గడం కారణం ఏదైనా.. గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే గుండెపోటును త్వరగా గుర్తిస్తే.. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. మనకు గుండెపోటు వచ్చే 30 నిమిషాల...

Heart Attack: గుండెపోటు వచ్చే అరగంట ముందు శరీరంలో కనిపించే మార్పులివే..
Heart Attack
Follow us on

ఇటీవల గుండెపోటు సమస్యలు ఎక్కువవుతున్నాయి. చిన్న వయసు వారు కూడా గుండె పోటుతో మృతి చెందడం కలవరపెడుతోంది. అప్పటి వరకు ఆడుతుపాడుతూ సంతోషంగా ఉన్న వ్యక్తులు కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. పట్టుమని పాతికేల్లు కూడా నిండని వారు హృద్రోగ్రాల భారిన పడడం వైద్యులను సైతం విస్మయానికి గురి చేస్తోంది.

అయితే గుండెపోటు బారిన పడడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. జీవనవిధానంలో మార్పులు, తీసుకునే ఆహారం సరిగ్గా లేకపోవడం, శారీరకశ్రమ తగ్గడం కారణం ఏదైనా.. గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే గుండెపోటును త్వరగా గుర్తిస్తే.. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. మనకు గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందే శరీరం కొన్ని హెచ్చరికలను చేస్తుంది. ఇంతకీ 30 నిమిషాల ముందు కనిపించే ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గుండెపోటు వచ్చే అరగంట లేదా అంతకంటే ముందు ఛాతీలో నొప్పి మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. అసిడిటీ లాంటి ఎలాంటి సమస్యలు లేకున్నా ఛాతీలో నొప్పి వస్తే మాత్రం వెంటనే అలర్ట్ అవ్వాలని చెబుతున్నారు. అలాగే అరగంట ముందు ఎడమ చేతిలో నొప్పి వస్తుంది. వెంటనే విపరీతంగా చెమటలు వస్తాయి. వాతావరణంతో సంబంధం లేకుండా చెమటలు వస్తే మాత్రం కచ్చితంగా వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.

వీటితో పాటు గుండెపోటు వచ్చే ముందు.. కడుపులో తీవ్రమైన నొప్పి, పొత్తి కడుపు ఉబ్బినట్లుగా అనిపించడం, కడుపులో గ్యాస్ పెరిగినట్లు అనిపిండచం, ఛాతిపై ఒత్తిడి పెరిగినట్లు ఉండడం, గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడం, తీవ్రమైన అలసట వేధిస్తున్నా, గుండె నుంచి వెన్నువైపుగా నొప్పి కదులుతున్నట్లు అనిపించడం వంటి లక్షణాలు కూడా గుండెపోటుకు ప్రాథమిక లక్షణంగా నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పైన తెలిపిన లక్షణాల్లో ఏది కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..