Hemoglobin: శరీరంలో హిమోగ్లోబిన్‌ తక్కువగా ఉంటే.. ఏమవుతుందో తెలుసా.?

దీని వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శరీరంలో ఐరన్ లోపం వల్ల ప్రజలు అనేక వ్యాధుల బారిన పడతారు. ఐరన్ లోపం వల్ల శరీరం బలహీనపడటమే కాకుండా రక్తహీనత బారిన పడవచ్చు. శరీరంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి లోపం కారణంగా, హిమోగ్లోబిన్ తగ్గడం ప్రారంభమవుతుంది. దీని వల్ల శరీరం చాలా బలహీనంగా మారుతుంది...

Hemoglobin: శరీరంలో హిమోగ్లోబిన్‌ తక్కువగా ఉంటే.. ఏమవుతుందో తెలుసా.?
Hemoglobin

Edited By:

Updated on: Oct 12, 2024 | 10:45 PM

శరీరంలో హిమోగ్లోబిన్‌ ఎంతో కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరంలోని అన్ని భాగాలకు రక్తం ప్రవహించాలన్నా, ఆక్సిజన్‌ సరఫరా సరిగ్గా సాగాలన్నా హిమోగ్లోబిన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే హిమోగ్లోబిన్‌ లోపం బారిన పడుతోన్న వారి సంఖ్య ఇటీవల క్రమంగా పెరుగుతోంది. శరీరంలో ఎర్రరక్త కణాలు సరిగ్గా ఉత్పత్తికానప్పుడు, రక్త కణాలు సరిగ్గా ఉత్పత్తి కావు. హిమోగ్లోబిన్‌ లేకపోవడం వల్ల శరీర భాగాల్లో ఆక్సిజన్‌ ​​కొరత ఏర్పడుతుంది.

దీని వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శరీరంలో ఐరన్ లోపం వల్ల ప్రజలు అనేక వ్యాధుల బారిన పడతారు. ఐరన్ లోపం వల్ల శరీరం బలహీనపడటమే కాకుండా రక్తహీనత బారిన పడవచ్చు. శరీరంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి లోపం కారణంగా, హిమోగ్లోబిన్ తగ్గడం ప్రారంభమవుతుంది. దీని వల్ల శరీరం చాలా బలహీనంగా మారుతుంది. హిమోగ్లోబిన్ లోపంతో బాధపడితే తీసుకునే ఆహారంలోకొన్ని రకాల మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో హిమోగ్లోబిన్‌ కౌంట్‌ను పెంచే ఆహారపదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సత్తుపిండిని తీసుకోవడం వల్ల శరీరంలో రక్త హీనత సమస్య నుంచి బయటపడొచ్చు. సత్తులో ఆరోగ్యానికి అవసరమైన ఖనిజాలు లభిస్తాయి. ఇవి ఎర్ర రక్త కణాల ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే కిడ్నీ బీన్స్, వైట్ బీన్స్ వంటి చిక్కుళ్లలో కూడా ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. దానిమ్మ కూడా ఎర్ర రక్త కణాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. దానిమ్మలో విటమిన్ కె, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త హీనతను తగ్గిస్తాయి.

రాగుల్లో ఐరన్‌ ఉంటుంది, ఇది ఎర్ర రక్తకణాల ఏర్పాటుకు, రక్తహీనతతో పోరాడడంలో సహాయపడుతుంది. ఇక అత్తి పండ్లలో విటమిన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అంజూర పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. రక్తహీనతతో బాధపడేవారు ప్రతీ రోజూ ఉదయం కరివేపాకు టీ తాగడాన్ని అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. శరీరానికి కావాల్సిన ఐరన్‌ను అందిస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..