
ప్రస్తుత రోజుల్లో జీన్స్ ధరించడం సర్వ సాధారణమైన విషయం తెలిసిందే. పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా చాలా మంది టైట్ జీన్స్‌ను ధరిస్తున్నారు. ఫ్యాషన్‌కు కేరాఫ్‌గా మారిన సమయంలో జీన్స్‌ను ధరించడం ఒక ట్రెండ్‌గా మారింది. అయితే ఫ్యాషనబుల్‌గా ఉండే జీన్స్ వల్ల కొన్ని రకాల సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా టైట్ జీన్స్ ధరించడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ టైట్ జీన్స్ ధరించడం వల్ల కలిగే ఆ దుష్ప్రభవాలు ఏంటో ఇప్పడు తెలుసుకుందాం..
జీన్స్‌లో ప్రస్తుతం టైట్ జీన్స్ ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా స్ట్రెచబుల్‌గా ఉండే జీన్స్, శరీరాన్ని అతుక్కుపోయేలా ఉంటున్నాయి. వీటివల్ల రక్త ప్రసరణపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. కేవలం ఆరోగ్యంపై మాత్రమే కాకుండా టైట్ జీన్స్ వల్ల అసౌకర్యంగా కూడా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక టైట్ జీన్స్ ధరించడం వల్ల మూత్రనాళంలో మంటలు వస్తాయని అనేక పరిశోధనలు కూడా వెల్లడించాయి. ముఖ్యంగా పురుషుల్లో టైట్ జీన్స్ వల్ల తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పురుషుల్లో టైట్ జీన్స్ ధరించడం వల్ల సంతానోత్పత్తి పై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. స్పెర్మ్ కౌంట్‌పై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. టైట్ జీన్స్ ధరించడం వల్ల చెమట ఎక్కువై తీవ్ర చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇది రక్త ప్రసరణ, నాడీ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది.
ఇక జీన్స్ తయారీలో ఉపయోగించే రంగులు శరీరంపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. జీన్స్‌కు వేసే రంగులు సింథటిక్‌గా ఉంటాయి.ఇది చర్మంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. స్కిన్ ఎలర్జీలకు ఇది కారణంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి వీలైనంత వరకు టైట్ జీన్స్‌కు దూరంగా ఉండడమే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..