
ప్రస్తుతం మనిషి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. వేగంగా పెరుగుతోన్న గ్లోబలైజేషన్, పట్టణీకరణ కారణంగా వర్క్ కల్చర్ కూడా మారిపోయింది. అలాగే సూర్యకాంతి పడడానికి కూడా వీలులేని అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉండడం, ఉద్యోగ ప్రదేశాలు కూడా ఇలాగే కాంతి చేరని చోటులో ఉన్న కారణంగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిత్యం విద్యుత్ దీపాల వెలుగుల్లో ఉండాల్సి పరిస్థితి ఉంటోంది. సహజకాంతికి దూరమై ఇలా కృత్రిమ కాంతిలో ఉండడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబెతున్నారు. ఇంతకీ ఆ ఆర్టిఫిషియల్ లైట్ వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు చూద్దాం.
* ప్రకాశవంతమైన విద్యుత్ బల్బులు, ట్యూబ్ లైట్లను అధికంగా ఉపయోగించడం కంటి ఆరోగ్యానికి చాలా హానికరం. పగలు, రాత్రి ఈ రకమైన కాంతికి గురికావడం వల్ల కళ్లపై చాలా ఒత్తిడి పడుతుంది. దీనివల్ల అలసట, చూపు మందగించడం, తలనొప్పి వంటి సమస్యలు మొదలవుతాయి. దీర్ఘకాలంలో, ఇది వేగంగా కంటి చూపును కోల్పోయేలా చేస్తుంది. దీనితో పాటు, కంటిశుక్లం, రాత్రి అంధత్వంతో పాటు ఇతర కంటి సంబంధిత వ్యాధులకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
* ఇక అధిక కాంతి శరీర సహజ సిర్కాడియన్ రిథమ్‌కు అంతరాయం కలిగిస్తుంది, ఇది నిద్రలేమికి దారితీస్తుంది లేదా నిద్ర నాణ్యత తగ్గిస్తుంది. మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిలో తగ్గుదల నిద్ర, మేల్కొలుపు చక్రాలలో అసమతుల్యతకు దారితీస్తుంది. నిద్రలేమి కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.
* ఇక పగలు, రాత్రి అనే తేడా లేకుండా బల్బుల వెలుతురులో గడిపితే.. అది మన నిద్రను ప్రభావితం చేస్తుంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల, మన సిర్కాడియన్ రిథమ్ కూడా చెదిరిపోతుంది. మన శరీరం యొక్క 24 గంటల సహజ చక్రం ఏది. దీని కారణంగా, శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ప్రారంభమవుతుంది, ఇది మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే ఆందోళన, ఒత్తిడి, నిరాశ వంటి సమస్యలకు దారి తీస్తుంది. అందువల్ల, రాత్రిపూట పడుకునే సమయంలో వీలైనంత వరకు లైట్స్ లేకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
* ఇక ఈ కృత్రిమ కాంతి కారణంగా టైప్ 2 డయాబెటిస్ పెరిగే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన పలు పరిశోధనలు సైతం ఈ విషయాన్ని తెలిపాయి. దీనికి కారణంగా ఆర్టిఫిషియల్ లైట్స్.. శరీరం సహజ జీవ గడియారాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఇన్సులిన్‌తో పాటు జీవక్రియలో అసమతుల్యానికి దారి తీస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగడానికి కారణమవుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..