Kids: చిన్నారుల్లో లూజ్‌ మోషన్‌ సమస్యా.? ఇంటి చిట్కాలతోనే చెక్ పెట్టండి..

|

Jul 27, 2024 | 2:00 PM

వర్షాకాలంలో చిన్నారుల్లో ఎక్కువగా అతిసారం సమస్య కనిపిస్తుంది. వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపునొప్పి, బలహీనత, ఆకలి లేకపోవడం వంటివన్నీ డయేరియా సంబంధిత లక్షణాలుగా చెప్పొచ్చు. చిన్నారుల్లో ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదకరంగా...

Kids: చిన్నారుల్లో లూజ్‌ మోషన్‌ సమస్యా.? ఇంటి చిట్కాలతోనే చెక్ పెట్టండి..
Kids Health
Follow us on

వర్షాకాలంలో కనిపించే సాధారణ ఆరోగ్య సమస్యల్లో డయేరియా ఒకటి. మరీ ముఖ్యంగా చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అపరిశ్రమైన ఆహారం, నీరు తాగడం వల్ల ఈ సమస్య బారినపడుతుంటారు. అలాగే వర్షాకాలంలో ఎక్కువగా కనిపించే ఈగలు సైతం చిన్నారుల్లో అనారోగ్య సమస్యలకు కారణమవుతుంటాయి. దీంతో వెంటనే వైద్యులను సంప్రదించి, మందులను ఉపయోగిస్తుంటారు. అయితే ఆసుపత్రికి వెళ్లకుండానే, కొన్ని నేచురల్‌ టిప్స్‌ ద్వారా చిన్నారుల్లో డయేరియా సమస్యను తగ్గింవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వర్షాకాలంలో చిన్నారుల్లో ఎక్కువగా అతిసారం సమస్య కనిపిస్తుంది. వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపునొప్పి, బలహీనత, ఆకలి లేకపోవడం వంటివన్నీ డయేరియా సంబంధిత లక్షణాలుగా చెప్పొచ్చు. చిన్నారుల్లో ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే డయేరియా లక్షణాలు కనిపించిన వెంటనే చిన్నారుల డైట్‌లో కొన్ని మార్పులు చేయాలి. అవేంటంటే..

డయేరియా కారణంగా చిన్నారుల్లో డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. కాబట్టి ఇలాంటి వారికి ఓఆర్‌ఎస్‌ పౌడర్‌ను నీటీలో కలిపి రోజులు మూడు సార్లు ఇవ్వాలి. అతిసారం కారణంగా శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి అందించవచ్చు. అలాగే అరటి పండును కూడా ఒవచ్చు. అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. డయేరియా బారిన పడిన చిన్నారులకు గంజిని ఇచ్చినా మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఉసిరి రసాన్ని అందించిన జీర్ణ శక్తి బలోపేతం అవుతుంది.

ఇలా వీలైనంత వరకు ఆహారాన్ని లిక్విడ్ రూపంలోనే అందించారు. శరీరంలో ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలి. విరేచనాల కారణంగా శరీరంలో సహజంగానే నీటి శాతం తగ్గిపోతుంది. అలాగే ఈ సమయంలో జీర్ణక్రియ రేటు సైతం మందగిస్తుంది. కాబట్టి ఘన రూపంలో ఉండే ఆహారాన్ని అస్సలు ఇవ్వకూడదు. ముఖ్యంగా స్పైసీ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. అలాగే చిప్స్‌ వంటి నూనెలో వేయించిన ఫుడ్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వొద్దు. ఇక ఒకవేళ ఈ జాగ్రత్తలు పాటించినా సమస్య తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..