మన అలవాట్లే మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మంచి అలవాట్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నుంచి కాపాడతాయి. అదే సమయంలో కొన్ని అలవాట్లు శరీరాన్ని రోగాల పుట్టగా కూడా మార్చేస్తాయి. శరీర బరువుకు సంబంధించిన కూడా ఇదే ఫార్ములా వర్తిస్తుంది. మన అలవాట్లే ఈ విషయంలోనూ కీలక భూమిక పోషిస్తాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి తిరిగి బెడ్‌పై చేరే వరకూ మీరు చేసే ప్రతి పని మీ శరీర బరువును ప్రభావితం చేస్తాయి. మన దేశంలో అధిక బరువుతో బాధ పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇదే విషయాన్ని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్‌ఐహెచ్) స్పష్టం చేసింది. ముఖ్యంగా సెడెంటరీ లైఫ్ స్టైల్(నిశ్చల జీవనశైలి) చాలా మందిని ఊబకాయులుగా మర్చేస్తోందని లెక్కల ద్వారా వివరించింది. ఒకవేళ మీరు కూడా అధిక బరువుతో బాధపడుతుంటే మీరు ఉదయం లేవగానే కొన్ని అలవాట్లను అలవర్చుకుంటే మీ బరువును త్వరగా అదుపుచేసుకొనే వీలుంటుంది.
ఉదయాన్నే నిద్ర లేవాలి.. చిన్నప్పుడు మన స్కూళ్లలో గుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పేటప్పుడు ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ అంటూ టీచర్లు చెప్తారు. నిజంగా ఆరోగ్యకర జీవన విధానంలో ఇది ఓ మంత్రంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. సమయానికి నిద్రపోయి, సమయానికి తిరిగి లేవాలని సూచిస్తున్నారు. నిద్ర షెడ్యూల్స్ ను కచ్చితంగా అమలు చేయాలంటున్నారు. ఇది సక్రమంగా లేకపోతే శరీరం కంట్రోల్‌లో ఉండదు. యాంగ్జైటీ పెరిగిపోతుంది. బంధాల్లో దూరం పెరిగిపోతుంది. అంతేకాక శరీర బరువు పెరగడానికి కారణమవుతుంది.
వేడి నీరు తాగాలి.. ప్రతి రోజూ ఉదయం ఓ గ్లాస్ వేడి నీరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంతో పాటు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీర జీవక్రియను అదుపు చేసి, బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది.
అధిక ప్రోటీన్లు కలిగిన అల్పాహారం.. ఉదయం అల్పాహారం అనేది శరీరానికి చాలా అవసరం. దీనిలో విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. అయితే ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే బరువు తగ్గానికి సాయపడతాయి. ఎంత మోతాదులో ప్రోటీన్లు అవసరం అనేది మీ వయసును బట్టి ఉంటుంది.
మంచి నిద్ర.. రాత్రి సమయంలో సుఖమయ నిద్ర కూడా బరువును అదుపు చేయడంలో బాగా సాయపడుతుంది. వాస్తవానికి రాత్రి నిద్ర సమయంలోనే శరీరం మరమ్మతులు చేసుకుంటుంది. మీరు ఫిజికల్‌గా, మెంటల్‌గా యాక్టివ్‌గా ఉండాలంటే సరిపడినంత రాత్రి నిద్ర తప్పనిసరి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..