పాలు మంచి పౌష్టికాహారం. ప్రతి రోజూ తీసుకోవాలని నిపుణులు సైతం సూచిస్తుంటారు. ముఖ్యంగా పిల్లలలకు తప్పనిసరిగా పాలు తాగించాలి. దీనిలో పుష్కలంగా లభించే కాల్షియం ఎములకు పుష్టి నిస్తాయి. అయితే ఆ పాలు కూడా మీ పిల్లలకు అనారోగ్యాన్ని కలుగుజేస్తాయని మీకు తెలుసా? పాలు ఆరోగ్యం అంటూనే.. అనారోగ్యం అంటున్నారేమిటి అని ఆశ్చర్యపోతున్నారా? పాలు ఆరోగ్యమే కానీ.. వాటిలో కలిపి తీసుకొని పదార్థాల విషయంలోనే జాగ్రత్త అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఓ సారి చూద్దాం..
తల్లులు పిల్లల ప్లేట్‌పై ఉంచే ఆహారం విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఆరోగ్యకరమైన, షోషకాలతో కూడిన, రుచికరమైన, బలవర్థక ఆహారం ఇస్తుంటారు. ఏ మాత్రం తేడా చేసినా పిల్లలకు అజీర్తి, గ్యాస్, కోలిక్, వికారం, వాంతులు వంటివి ఇబ్బంది పెడతాయి. అలాగే పాలతో పాటు కలిపి ఇచ్చే వాటి విషయంలో కూడా తల్లులు జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు. పాలతో పాటు కొన్ని రకాల పదార్థాలు కలిపి తీసుకోవడం అనర్థాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఆహార పదార్థాలు ఏమిటో చూద్దాం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..