
పీరియడ్స్ అనగానే చాలా మంది లేడీస్ కి భయంగా ఉంటుంది. అందుకు ఒక్కటి అని ఏమీ చెప్పలేరు. రకరకాల కారణాలు ఉంటాయి. ముఖ్యంగా హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ వల్ల పలు సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. నెలసరిలో బయటకు వెళ్లాలన్నా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే నెలసరి సమయంలో కొంత మందికి తెలీక కొన్ని ఆహార పదార్థాలను తినేస్తూ ఉంటారు. దీని వల్ల మరిన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి రుతుక్రమంలో ఈ ఫుడ్స్ కి దూరంగా ఉంటే చాలా మంచిది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

పీరియడ్స్ లో రకరకాల మూడ్ స్వింగ్స్ ఉంటాయి. వీటిని దూరం చేసుకోవడానికి చాలా మంది మహిళలు కాఫీ, టీలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకోవడం కారణంగా మానసిక ఆందోళన పెరుగుతుంది. అంతే కాకుండా పొట్ట నొప్పి కూడా వస్తుంది.

నెలసరి సమయంలో కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం వల్ల.. స్త్రీ జననేంద్రియాలకు సమస్యలు వస్తాయి. వీటి కారణంగా పొత్తి కడుపులో నొప్పి, జీర్ణ క్రియ సమస్యలు వంటివి ఎదుర్కొనాల్సి ఉంటుంది. అలాగే మద్యానికి కూగా దూరంగా ఉండటమే మంచిది.

అలాగే చక్కెర ఎక్కువగా ఉండే ప్రాసెస్ చేసిన ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. వీటి కారణంగా.. బ్లడ్ లో షుగర్ లెవల్స్ పెరిగి పోవడం లేదా తగ్గి పోవడం జరగవచ్చు. దీని వల్ల చక్కెర ఉన్న పదార్థాలు తినాలి అనిపిస్తుంది. దీంతో డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

పాలు బలమని కొంత మంది పీరియడ్స్ లో తాగుతూ ఉంటారు. పాలలో లాక్టోస్, అరాకిడోనిక్ అనే ఆమ్లం ఉంటుంది. దీని కారణంగా ఇది పొట్ట ఉబ్బరాన్ని పెంచడమే కాకుండా కడుపులో నొప్పి కూడా వస్తుంది. కాబట్టి రుతుక్రమం సమయంలో మూడు రోజులూ పాలకు దూరంగా ఉంటే బెటర్.