Iron Rich Foods: బచ్చలి కూర కంటే ఐరన్ ఎక్కువగా లభించే ఫుడ్స్ ఇవే!

ప్రస్తుత కాలంలో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్‌లో ఐరన్ లోపం కూడా ఒకటి. ఐరన్ లోపం కారణంగా శరీరంలో రక్తం తక్కువగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే.. అన్ని రకాల పోషకాలు అవసరం అవుతాయి. అలాగే ఐరన్ కూడా తగినంత మోతాదులో తీసుకోవాలి. లేదంటే రోగ నిరోధక శక్తి తగ్గిపోయి.. అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. రక్త హీనత సమస్య ఉంటే డిప్రెషన్, ఆందోళన కూడా ఎక్కువ అవుతాయి. కాబట్టి మీ డైట్‌లో ఐరన్ అధికంగా లభించే ఆహారాలు కూడా..

Iron Rich Foods: బచ్చలి కూర కంటే ఐరన్ ఎక్కువగా లభించే ఫుడ్స్ ఇవే!
Iron Rich Foods
Follow us

|

Updated on: Apr 27, 2024 | 4:39 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్‌లో ఐరన్ లోపం కూడా ఒకటి. ఐరన్ లోపం కారణంగా శరీరంలో రక్తం తక్కువగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే.. అన్ని రకాల పోషకాలు అవసరం అవుతాయి. అలాగే ఐరన్ కూడా తగినంత మోతాదులో తీసుకోవాలి. లేదంటే రోగ నిరోధక శక్తి తగ్గిపోయి.. అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. రక్త హీనత సమస్య ఉంటే డిప్రెషన్, ఆందోళన కూడా ఎక్కువ అవుతాయి. కాబట్టి మీ డైట్‌లో ఐరన్ అధికంగా లభించే ఆహారాలు కూడా తీసుకోండి. సాధారణంగా బచ్చలి కూరలో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ బచ్చలి కూర కంటే ఇతర ఆహార పదార్థాల్లో కూడా ఐరన్ అధిక మోతాదులో లభిస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

లివర్:

మటన్ లివర్‌లో ఐరన్ కంటెంట్ అనేది అధికంగా లభిస్తుంది. కాబట్టి రక్త హీనత సమస్యతో బాధ పడేవారు.. మటన్ లివర్ తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడొచ్చు.

టోఫు:

ఐరన్ అధికంగా లభించే ఆహార పదార్థాల్లో టోఫు కూడా ఒకటి. ఇది కూడా పన్నీర్ లాగానే ఉంటుంది. రుచి కూడా అలాగే ఉంటుంది. టోఫులో కూడా ఐరన్‌తో పాటు ఇతర పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి టోఫును తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

గుమ్మడి గింజలు:

గుమ్మడి కాయ గింజల్లో కూడా చాలా రకాల పోషకాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిని కూడా డ్రైఫ్రూట్స్‌లో ఒక భాగం చేశారు. గుమ్మడి విత్తనాల్లో ఐరన్ అధికంగా లభిస్తుంది. కాబట్టి గుమ్మడి గింజలు తినడం వల్ల కూడా రక్త హీనత సమస్య నుంచి బయట పడొచ్చు.

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్‌లో కూడా ఐరన్ అనేది మెండుగా లభిస్తుంది. కాబట్టి తగిన మోతాదులో డార్క్ చాక్లెట్ తీసుకోవడం చాలా మంచిది. అంతే కాకుండా డార్క్ చాక్లెట్ తినడం వల్ల పలు రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన వంటి వాటిని తగ్గించుకోవచ్చు.

నువ్వులు:

చాలా మంది నువ్వులను దూరం పెడతారు. కానీ నువ్వుల్లో ఐరన్ అనేది చాలా ఎక్కువగా లభిస్తుంది. వారం రోజుల పాటు నువ్వులను తీసుకుంటే రక్త హీనత సమస్య నుంచి బయట పడతారు. కాబట్టి నువ్వుల్ని కూడా మీ డైట్‌లో యాడ్ చేసుకోండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
డూ ఆర్ డై మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
డూ ఆర్ డై మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్
గుజరాత్ నాయకులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
గుజరాత్ నాయకులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు