మీ పిల్లలను స్మార్ట్ ఫోన్‌లకు ఇలా దూరంగా ఉంచండి..
చిన్నారుల ఆలోచనా శక్తిని మెరుగుపరచడానికి క్రాస్‌వర్డ్ పజిల్స్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. వీటి ద్వారా చిన్నారుల మెదడు షార్ప్ అవుతుంది. అలాగే వారిని స్మార్ట్ ఫోన్‌లకు దూరం చేస్తుంది.
ఇక పిల్లల బ్రెయిన్ షార్ప్ కావడానికి వారికి రూబిక్స్ క్యూబ్‌ను అలవాటు చేయాలి. దీని ద్వారా చిన్నారులు బిజీగా మారడంతో పాటు ఆలోచన శక్తి పెరుగుతుంది.
సుడోకు కూడా చిన్నారుల ఆలోచన శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. అయితే స్మార్ట్ ఫోన్స్‌లో సుడోకు కాకుండా పేపర్స్‌పై లభించేవి ఉంటాయి. అలాంటి వాటిని అలవాటు చేయడం బెటర్.
ఇక చిన్నారులను స్మార్ట్ ఫోన్‌లకు బానిసలుగా మారకుండా ఉండాలంటే వారికి ఈ సమ్మర్‌లో ఏదైనా కొత్త ఆర్ట్‌ను నేర్పించండి. ముఖ్యంగా గిటార్, డ్యాన్స్ క్లాసెస్ వంటి వాటికి పంపించండి.
చిన్నారులను స్మార్ట్ ఫోన్‌లకు దూరంగా ఉంచాలంటే వారికి సమ్మర్‌లో స్విమ్మింగ్ నేర్పించండి. దీంతో ఆరోగ్యంతో, ఇతర వ్యాపకంపై వారి మనసు స్మార్ట్ ఫోన్స్‌పై మళ్లకుండా ఉంటుంది.
ఇక సాయంత్రం కచ్చితంగా చిన్నారులను అలా పార్క్‌లకు తీసుకెళ్లడాన్ని అలవాటు చేయండి. వీటి ద్వారా శారీరక ఆరోగ్యంతో పైటు మెంటల్ హెల్త్ కూడా మెరుగుపడుతుంది.
అదే విధంగా చిన్నారులకు కథలు చెప్పండి. ముఖ్యంగా నీతిని పంచే కథలను, సమాజంలో ఎలా ఉండాలన్ని వివరాలను తెలిపే కథలను వారికి వివరించాడు. ఇది వారి ఆలోచన విధానాన్ని మార్చడంలో ఉపయోగపడుతుంది
ఇక చిన్నారులకు పుస్తకాలు చదవడాన్ని అలవాటు చేయండి. ఇది పెద్దయ్యాక వారిలో ఎంతో మార్పును కలిగిస్తుంది. ముఖ్యంగా ఇన్‌స్పిరేషనల్ పుస్తకాలను చదడం నేర్పించండి.