ఇక అవిసె గింజలు చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచతాయి. దీంతో రక్తంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది దీర్ఘకాలంలో వచ్చే హృద్రోగాలకు చెక్ పెడుతుంది.
బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్‌లో కచ్చితంగా అవిసె గింజలను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది.
ఇక అవిసె గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. మలబద్ధకం దూరమవుతుంది
మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా అవిసె గింజలు ఉపయోగపడతాయి. ఇందులోని ఒమేగా-3 ఫ్యాట్టీ యాసిడ్స్ బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.