రుచికరమైన జిలేబి మీ ఇంట్లోనే రెడీ..
TV9 Telugu
07 May 2024
రుచికరమైన జిలేబిని తయారీకి కావాల్సిన పదార్థాలు మైదా, శనగ పిండి, తాజా పెరుగు, చక్కెర, నీళ్లు, నెయ్యి
ముందుగా ఒక బౌల్‌లోకి మైదా పిండిని తీసుకోని దానికి శనగపిండి, తాజా పెరుగు కలిపి ఉండలు రాకుండా పేస్ట్‌గా కలుపుకోని 10 నిమిషాల ఉంచాలి.
తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపై ఓ పాన్ పెట్టండి. ఇందులో పంచదార వేసి, తర్వాత నీళ్లు వేసి పాకం వచ్చేవారు వేడి చెయ్యాలి.
దీంట్లోకి అవసరమైతే కుంకుమ పువ్వు, ఫుడ్ కలర్ కూడా కలుపుకోవచ్చు. ఫుడ్ కలర్ కలపడం వల్ల అచ్చంగా మార్కెట్లో దొరికే జిలేబిల్లా వస్తాయి.
తర్వాత మరో స్టౌవ్‌పై బాండీ పెట్టి అందులో నూనె లేదా నెయ్యిని వేసి కొంతసేపు అది భాగా మరిగే వరకు వేచి ఉండండి.
ముందుగా తయారు చేసుకున్న పిండిని కోన్‌లాంటి ప్లాస్టిక్ కవర్‌లో నింపి నెమ్మదిగా జిలేబి ఆకారం వచ్చేలా నూనెలో వేయాలి.
నూనెలో వేసిన పిండి రెండు వైపుల గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా వేగించాలి. బాగా వేగితే రుచి చాల బాగుంటుంది.
చివరిగా ముందుగా తయారు చేసుకున్న పంచదార పాకంలో జిలేబిలను కొద్ది సేపు ఉంచితే సరి వేడి వేడిగా రుచికరమైన జిలేబిలు రేడీ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి