చల్ల చల్లని కూల్ కూల్.. ఇంటిని చల్లబరిచే 5 చిట్కాలు 

Phani.ch

08 May 2024

వేసవి అనగానే ప్రతిమనిషికి గుర్తుకొచ్చేది ఏసీ.. పైగా ఈ వేసవి ష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనితో ఇళ్లలో ఏసీ, కూలర్ల వినియోగం కూడా బానే పెరిగింది

అయితే వీటిని ఎక్కువగా వినియోగించడం వల్ల వాతావరణ కాలుష్యం పెరగడమే కాకుండా ఇంట్లోని వారికి అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది.

కాబట్టి ఈ ఏసీ లు కూలర్ల వినియోగం తగ్గించి ఇంటిని చల్లబరుచుకునేందుకు తగిన ప్రయత్నాలు చేయాలి.  అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్ డోర్ ప్లాంట్స్ పెంచడం ద్వారా ఇంట్లో వేడి తగ్గి సహజ సిద్ధంగా ఇంటిని చల్లబరుస్తుంది. అలోవీరా, స్నేక్ ప్లాంట్ పెంచడం ద్వారా గాలిలోని టాక్సిన్స్ నుంచి కూడా మనం ఉపశమనం పొందవచ్చు.

ఒక పాత్రలో ఐస్‌క్యూబ్స్ తీసుకుని టేబుల్ ఫ్యాన్ ముందు ఉంచితే ఇంటిని చల్లగా ఉండేలా చేసి వేడి నుంచి ఉపశమనాన్ని అందించేందుకు తోడ్పడుతుంది.

వంట గదిలో  ఎగ్జాస్ట్ ఫ్యాన్ తప్పకుండ ఉపయోగించాలి.. దీని ద్వారా వంటగదిలోని వేడిని ఎప్పటికప్పుడు బయటకు పంపి ఇంటిని చల్లబరుస్తుంది.

బ్లాక్‌ అవుట్‌ కర్టెన్స్‌ వినియోగించడం వల్ల దాదాపు 24 శాతం తగ్గే అవకాశం ఉంది. వీటని కిటికీలకు వేయడం వల్ల ఎండాకాలంలో గదులను చల్లగా ఉంచుతాయి .

ఇంటి ఫ్యాన్‌ దిశ కౌంటర్ డైరెక్షన్‌ లో తిరిగేలా చూడండి. ఈ విషయం మీకు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కానీ, ఫ్యాన్‌ కౌంటర్ డైరెక్షన్‌లో ఏర్పాటు చేసుకుంటే వేడిగాలి తగ్గడాన్ని మీరు గమనిస్తారు.