Health: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? విటమిన్‌ బీ12 లోపం ఉన్నట్లే..

శరీరంలో విటమిన్‌ బీ12 లోపిస్తే చేతులు, కాళ్లలో నొప్పి వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎముకలు బలహీనపడడం, రక్తహీనత, మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దృష్టి అస్పష్టంగా ఉన్నా అది విటమిన్‌ బీ12 లోపమని నిపుణులు చెబుతున్నారు. నాడీ వ్యవస్థపై కూడా బీ12 లోపం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు..

Health: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? విటమిన్‌ బీ12 లోపం ఉన్నట్లే..
శరీరంలో విటమిన్ బి12 లోపం తలెత్తితే తలనొప్పి, మైగ్రేన్ సమస్యను పెంచుతుంది. అలాగే శ్వాస సమస్యలు, మానసిక బలహీనత వంటి సమస్యలు కూడా తెలెత్తుతాయి. నాలుక వాపు, నోటిలో పొక్కులు వంటి లక్షణాలు కనిపించినా వెంటనే అలర్ట్ కావాలి.

Updated on: Jun 06, 2024 | 10:19 PM

శరీరానికి అన్ని రకాల విటమిన్లు అందితేనే ఆరోగ్యంగా ఉంటామని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా విటమిన్‌ బీ12 శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంది. రక్త కణాల నిర్మాణం, డీఎన్‌ఏలో ఈ విటమిన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా పురుషుల్లో 200 పీజీ/ఎమ్‌ఎల్‌, మహిళల్లో 900 పీజీ/ఎమ్‌ఎల్‌ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వృద్ధుల్లో అయితే విటమిన్‌ బీ12 300 నుంచి 350 పీజీ/ఎమ్‌ఎల్‌ మధ్య ఉండాలి. శరీరంలో కీలక పాత్ర పోషించే విటమిన్‌ బీ12 తగ్గితే శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు.

శరీరంలో విటమిన్‌ బీ12 లోపిస్తే చేతులు, కాళ్లలో నొప్పి వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎముకలు బలహీనపడడం, రక్తహీనత, మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దృష్టి అస్పష్టంగా ఉన్నా అది విటమిన్‌ బీ12 లోపమని నిపుణులు చెబుతున్నారు. నాడీ వ్యవస్థపై కూడా బీ12 లోపం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు నిత్యం కాళ్లలో జలదరింపు ఉన్నా.. నిత్యం అలసట, నీరసం, తలనొప్పి, కళ్లు తిరగడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్న ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఇక శరీరంలో బీ12 విటమిన్‌ తగ్గితే ఆకలి తగ్గుతుంది. నిత్యం అలసటతో. నీరసంగా ఉంటారు. వికారం, వాంతులు, అతిసారం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో నాలుక నొప్పిగా మారుతుంది. అలాగే చర్మం పసుపు రంగులోకి మారుతుంది. పైన తెలిపిన సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు నిర్వహించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఇలా జయించవచ్చు..

ఇదిలా ఉంటే బీ12 విటమిన్‌ లోపం రాకుండా ఉండాలంటే కచ్చితంగా జీవనశైలిలో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. వీటిలో ప్రధానమైనవి.. పాల ఉత్పత్తులను ఆహారంలోభ భాగం చేసుకోవాలి. అలాగే వారంలో కనీసం రెండుసార్లైనా చికెన్‌, గుడ్లను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మేక, గొర్ర మాంసం ద్వారా కూడా బీ12 లోపాన్ని జయించవచ్చు. వీటితో పాటు ఆహారంలో చేపలు, చీజ్‌ను భాగం చేసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.