Cancer: ఈ లక్షణాలు కడుపు క్యాన్సర్‌ సంకేతాలు కావొచ్చు.. వెంటనే అలర్ట్ అవ్వాల్సిందే..

|

Oct 20, 2024 | 12:25 PM

ప్రస్తుతం కడుపు క్యాన్సర్ బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ ఈ సమస్య ఎక్కువవుతోంది. అయితే ఈ క్యాన్సర్ ను ముందుగా గుర్తిస్తే చికిత్స సులభతరమవుతుందని నిపుణులు అంటున్నారు. కడుపు క్యాన్సర్ ను కొన్ని ముందస్తు

Cancer: ఈ లక్షణాలు కడుపు క్యాన్సర్‌ సంకేతాలు కావొచ్చు.. వెంటనే అలర్ట్ అవ్వాల్సిందే..
Cancer
Follow us on

ప్రస్తుతం క్యాన్సర్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంతా క్యాన్సర్‌ బాధితుల సంఖ్య శరవేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా తీసుకుంటున్న ఆహారంలో వస్తున్న మార్పులు, జీవనశైలి కారణంగా స్టమక్‌ క్యాన్సర్‌ సమస్యల ఎక్కువుతోంది. కడుపు క్యాన్సర్‌ కేసుల్లో త్వరగా ప్రాణాలు పోయే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. అయితే ఈ క్యాన్సర్‌ను ముందుగా గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాలు నిలబెట్టుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ స్టమక్ క్యాన్సర్‌ ప్రాథమిక లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* కడుపులో నొప్పి, వాపు ఉంటే కడుపు క్యాన్సర్‌కు ప్రాథమిక లక్షణంగా చెప్పొచ్చని నిపుణులు అంటున్నారు. ఎలాంటి కారణం లేకుండా నొప్పి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా కడుపు ఎగువ భాగంలో నొప్పితో పాటు వాపు ఉండి.. క్రమేణ వాపుతో పాటు నొప్పి కూడా పెరుగుతుంటే వైద్యులను సంప్రదించాలి.

* కడుపుబ్బరం సమస్య సర్వసాధారణమని తెలిసిందే. ఆహారపు అలవాట్ల కారణంగా కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది. అయితే దీర్ఘకాలంగా ఈ సమస్య వేధిస్తుంటే మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నిత్యం కడుపు ఉబ్బినట్లు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. నెల రోజులకు మించి ఈ సమస్య ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

* నిత్యం కడుపు మంటతో పాటు ఛాతీలో నొప్పి, మంట వంటి సమస్యలు కూడా క్యాన్సర్‌కు సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. కడుపు క్యాన్సర్‌ ప్రారంభంలోనే జీర్ణక్రియ దెబ్బతింటుంది. ఇది గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్‌ వంటి సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు.

* నిత్యం వాంతులు, వికారం వంటి సమస్యలు కనిపిస్తుంటే కూడా క్యాన్సర్‌ ముందస్తు లక్షణంగా భావించాలని అంటున్నారు. ఈ సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

* కడుపు క్యాన్సర్‌తో బాధడేవారిలో మలంలో రక్తం రావడాన్ని గమనించవచ్చని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య కనిపిస్తే వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు అంటున్నారు. ఇది కడుపు క్యాన్సర్‌కు ముందస్తు లక్షణంగా భావించాలని చెబుతున్నారు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..