Health: వారం రోజుల ముందే బ్రెయిన్ స్ట్రోక్‌ను పసిగట్టవచ్చు.. ఎలాగంటే..

మెదడుకు సరైన రక్త సరఫరా లేకపోవడం, మెదడులోని రక్త నాళాలు పగిలిపోతాయి, దీని కారణంగా ఆక్సిజన్ సరిగ్గా చేరుకోలేక మెదడు పని చేయడం ఆగిపోతుంది. దీనినే బ్రెయిన్‌ స్టోక్‌ అంటారు. ఇలాంటి సమయంలో తక్షణ చికిత్స అందకపోతే ప్రాణం కూడా పోతుంది. అయితే, స్ట్రోక్ ఎప్పుడూ అకస్మాత్తుగా...

Health: వారం రోజుల ముందే బ్రెయిన్ స్ట్రోక్‌ను పసిగట్టవచ్చు.. ఎలాగంటే..
Brain Stroke
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 29, 2024 | 2:43 PM

మారుతోన్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా ఇటీవల బ్రెయిన్‌ స్ట్రోక్‌ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మెదడుకు సరైన రక్త సరఫరా లేకపోవడం, మెదడులోని రక్త నాళాలు పగిలిపోతాయి, దీని కారణంగా ఆక్సిజన్ సరిగ్గా చేరుకోలేక మెదడు పని చేయడం ఆగిపోతుంది. దీనినే బ్రెయిన్‌ స్టోక్‌ అంటారు. ఇలాంటి సమయంలో తక్షణ చికిత్స అందకపోతే ప్రాణం కూడా పోతుంది. అయితే, స్ట్రోక్ ఎప్పుడూ అకస్మాత్తుగా సంభవించదు. స్ట్రోక్‌ వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఓ అధ్యయనం ప్రకారం స్ట్రోక్ వచ్చిన వారిలో 43 శాతం మంది స్ట్రోక్‌కు ఒక వారం ముందు లక్షణాలను అనుభవించారని తేలింది. ఇంతకీ వారం ముందు కనిపించే ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* స్ట్రోక్‌ వచ్చే ఒక వారం ముందు కనిపించే లక్షణాల్లో చేతులు, కాళ్ళలో బలహీనత ప్రధానమైంది.ఈ రెండు భాగాలలో తిమ్మిరి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఇలాంటి లక్షణాలు దీర్ఘకాలంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

* స్ట్రోక్‌కు ముందు జ్ఞాపకశక్తి కూడా ప్రభావితమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాంటి సమయాల్లో పాత విషయాలు గుర్తుకు రాకపోవడం లేదా దేనిపైనా దృష్టి పెట్టలేకపోవడం వంటి సమస్యలు ఉంటాయి.

* స్ట్రోక్‌ వచ్చే 7 రోజుల ముందు తల తిరగడం వంటి సమస్యలు రావచ్చు. ఎటువంటి కారణం లేకుండా అకస్మాత్తుగా తరచుగా తల తిరుగుతున్న భావన కలిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

* స్ట్రోక్ వచ్చే ముందు కంటి చూపుపై కూడా ప్రభావం పడుతుంది. అకస్మాత్తుగా దృష్టి తగ్గినా, కంటి చూపు అస్పష్టంగా ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

* స్పష్టంగా మాట్లాడలేకపోవడం కూడా అనే స్ట్రోక్‌కు 7 రోజుల ముందు కనిపించే లక్షణాల్లో ఒకటి. మాట సరిగ్గా రాకపోయినా, పదాలను స్పష్టంగా పలకలేకపోతున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

* స్ట్రోక్‌కి ఒక వారం ముందు, శరీర సమతుల్యత దెబ్బతినవచ్చని నిపుణులు చెబుతున్నారు. నడవడానికి ఇబ్బందిగా అనిపించినా వైద్యులను సంప్రదించి, అవసరమైన చికిత్స తీసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

భారత్ కోసం ఆడటం మర్చిపో: బుమ్రా పనిభారం పై సంధు సంచలన వ్యాఖ్యలు
భారత్ కోసం ఆడటం మర్చిపో: బుమ్రా పనిభారం పై సంధు సంచలన వ్యాఖ్యలు
యుజ్వేంద్ర చాహల్ 'నిశ్శబ్ద' సందేశం
యుజ్వేంద్ర చాహల్ 'నిశ్శబ్ద' సందేశం
రూ.1000 కోసం దారుణహత్య.. కన్నతల్లి ఒడిలోనే కన్ను మూసిన యువకుడు
రూ.1000 కోసం దారుణహత్య.. కన్నతల్లి ఒడిలోనే కన్ను మూసిన యువకుడు
కివీస్ తో వైట్‌వాష్.. భారత క్రికెట్‌కు పెద్ద నష్టం: యువీ
కివీస్ తో వైట్‌వాష్.. భారత క్రికెట్‌కు పెద్ద నష్టం: యువీ
లారెన్స్ బిష్ణోయ్ బెదిరింపులు..సల్లూ ఇంటికి మరింత భద్రత
లారెన్స్ బిష్ణోయ్ బెదిరింపులు..సల్లూ ఇంటికి మరింత భద్రత
భారత క్రికెట్‌లో గంభీర్ సమీక్ష: కోహ్లీ, రోహిత్ పై ప్రశ్నల వర్షం!
భారత క్రికెట్‌లో గంభీర్ సమీక్ష: కోహ్లీ, రోహిత్ పై ప్రశ్నల వర్షం!
మహాత్మాగాంధీ వర్సిటీలో దారుణం.. విద్యార్ధుల బ్రేక్‌ఫాస్ట్ చూశారా?
మహాత్మాగాంధీ వర్సిటీలో దారుణం.. విద్యార్ధుల బ్రేక్‌ఫాస్ట్ చూశారా?
చిరుత హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..
చిరుత హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..
పార్వతి దేవిని అలా చూపిస్తారా? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతి దేవిని అలా చూపిస్తారా? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
క్రికెట్ గాడ్ తెలియదంటూ షాకిచ్చిన సోషల్ మీడియా స్టార్
క్రికెట్ గాడ్ తెలియదంటూ షాకిచ్చిన సోషల్ మీడియా స్టార్