Lifestyle: ఉదయం లేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? హైబీపీ ఉన్నట్లే..

అలాగే దేశ జనాభాలో మూడింట రెండొంతుల మంది అసలు వ్యాయామం చేయడానికి సమయం ఉండడం లేదని చెప్పడం గమనార్హం. ఇలాంటి కారణాల వల్లే అధిక రక్తపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే చాలా మంది రక్తపోటును ఇప్పటికీ సీరియస్‌గా తీసుకోవడం లేదు. బీపీ ట్యాబ్లెట్‌ వేసుకుంటకున్నాం ఇంకేముంది...

Lifestyle: ఉదయం లేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? హైబీపీ ఉన్నట్లే..
Hypertension Control Tips

Updated on: Mar 15, 2024 | 8:01 PM

రక్తపోటు సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో మాత్రమే కనిపించిన ఈ సమస్య ఇప్పుడు పట్టుమని పాతికేళ్లు కూడా నిండకముందే బీపీ బారిన పడుతున్నారు. రక్తపోటుకు ఎన్నో కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ప్రధానమైంది శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామం చేయకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. ఓ అంచనా ప్రకారం భారత్‌లో సుమారు 6 శాతం వ్యాయామం చేయడం లేదని తేలింది.

అలాగే దేశ జనాభాలో మూడింట రెండొంతుల మంది అసలు వ్యాయామం చేయడానికి సమయం ఉండడం లేదని చెప్పడం గమనార్హం. ఇలాంటి కారణాల వల్లే అధిక రక్తపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే చాలా మంది రక్తపోటును ఇప్పటికీ సీరియస్‌గా తీసుకోవడం లేదు. బీపీ ట్యాబ్లెట్‌ వేసుకుంటకున్నాం ఇంకేముంది అన్న ఆలోచనలో ఉంటున్నారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి కేవలం ట్యాబ్లెట్‌ వేసుకుంటే సరిపోదని, జీవనశైలిలో కచ్చితంగా మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. తీసుకునే ఆహారం మొదలు, జీవనశైలి వరకు మార్పులు చేసుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా ఒత్తిడి తగ్గించుకోవడంతో పాటు తీసుకునే ఆహారంలో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇక నిద్రలేమి కూడా బీపీకి ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.

అయితే రక్తపోటును ముందుగానే గుర్తిస్తే చికిత్స సులభతరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. పలు ముందస్తు లక్షణాల ద్వారా హైబీపీని ముందస్తుగానే గుర్తించవచ్చని చెబుతున్నారు. ఉదయం నిద్రలేచిన వెంటనే కనిపించే కొన్ని లక్షణాల ఆధారంగా హైబీపీ వచ్చే అవకాశాలను ముందుగానే పసిగట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం నిద్రలేవగానే తల తిరగడం వంటి లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.

ఇక ఉదయం నిద్రలేచిన వెంటనే దాహం వేయడం సర్వసాధారణమైన విషయం. అయితే నీరు తాగిన తర్వాత కూడా నోరు ఎండిపోయినట్లు భావన కలుగుతుంటే మాత్రం వెంటనే బీపీ చెక్‌ చేసుకోవాలని చెబుతున్నారు. ఇది కూడా రక్తపోటుకు ప్రాథమిక లక్షణంగా చెప్పొచ్చు. ఉదయం నిద్రలేచిన వెంటనే వాంతులు లేదా అస్పష్టమైన దృష్టి కూడా బీపీ లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. నిత్యం వికారం, బలహీనత వంటి సమస్యలు వెంటాడుతున్నా హైబీపీకి లక్షణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైన తెలిపిన లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..