Star Anise: స్టార్ పువ్వు తీసుకుంటే శరీరంలో జరిగే మార్పులు ఇవే!

|

Jun 18, 2024 | 5:16 PM

బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం. రోజూ బిర్యానీ పెట్టినా సరే లొట్టలేసుకుంటూ తినేస్తారు. కానీ బిర్యానీకి ఇంత రుచిని తీసుకొచ్చేవి మసాలాలు. ఈ మసాలాలతో కేవలం రుచి మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పటికే బిర్యానీలో ఉపయోగించే మసాలా దినుసుల గురించి చాలనే తెలుసుకున్నాం. ఇప్పుడు పులావ్‌లో ఉపయోగించే సార్ట్ పువ్వుతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం. స్టార్ పువ్వును అనాస పువ్వు..

Star Anise: స్టార్ పువ్వు తీసుకుంటే శరీరంలో జరిగే మార్పులు ఇవే!
Star Anise
Follow us on

బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం. రోజూ బిర్యానీ పెట్టినా సరే లొట్టలేసుకుంటూ తినేస్తారు. కానీ బిర్యానీకి ఇంత రుచిని తీసుకొచ్చేవి మసాలాలు. ఈ మసాలాలతో కేవలం రుచి మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పటికే బిర్యానీలో ఉపయోగించే మసాలా దినుసుల గురించి చాలనే తెలుసుకున్నాం. ఇప్పుడు పులావ్‌లో ఉపయోగించే సార్ట్ పువ్వుతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం. స్టార్ పువ్వును అనాస పువ్వు అని కూడా పిలుస్తారు. ఇందులో కూడా అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి. ఈ పువ్వుతో ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ స్టార్ పువ్వులో ఏం పోషకాలు ఉంటాయి? దీంతో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

అనాస పువ్వులో పోషకాలు:

ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, క్యాల్షియం, జింక్, కాపర్, సెలీనియం, విటమిన్లు బి1, బి2, బి3, బి6లతో పాటు విటమిన్ ఈ కూడా ఉంటుంది.

బ్రెయిన్ పవర్ పెంచుతుంది:

స్టార్ పువ్వుతో బ్రెయిన్ పవర్‌ను ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ పువ్వు బ్రెయిన్ బూస్టర్‌లా పని చేస్తుంది. స్టార్ పువ్వు తీసుకోవడం వల్ల మెదడును యాక్టివ్ అవుతుంది. మతి మరుపు తగ్గి.. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా ఏకాగ్రత, దృష్టిని మెరుగుపరుస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని సైతం మెరుగు పరుస్తుంది.

ఇవి కూడా చదవండి

డిప్రెషన్ మాయం:

స్టార్ పువ్వు తీసుకోవడం వల్ల డిప్రెషన్ అనేది తగ్గుతుంది. అనాస పువ్వు తీసుకోవడం వల్ల డ్రిపెషన్ తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో ఉండే విటమిన్ బి.. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

జలుబు తగ్గిస్తుంది:

స్టార్ పువ్వుతో గొంతు పువ్వు, జలుబు, ఫ్లూ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. సీజనల్ వ్యాధులను తగ్గించుకోవడంలో స్టార్ పువ్వు చక్కగా పని చేస్తుంది. ఇన్ ఫెక్షన్‌లకు కారణం అయ్యే బ్యాక్టీరియాను చంపుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. అంతే కాకుండా శరీరం నుంచి వ్యర్థాలు, ట్యాక్సిన్స్‌ను కూడా తొలగిస్తుంది.

డయాబెటీస్ కంట్రోల్:

స్టార్ పువ్వు తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. అనాస పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి మెండుగా ఉంటాయి. ఇది గుండె సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా కంట్రోల్ అవుతాయి.

తలనొప్పి మాయం:

తలనొప్పి సమస్య, మైగ్రేన్‌తో బాధ పడేవారు స్టార్ పువ్వుతో తగ్గించుకోవచ్చు. తలలో బిగువుగా మారిన కండరాలను అనాస పువ్వు తగ్గిస్తుంది. అనాస పువ్వు టీ తాగితే.. తలనొప్పి, మైగ్రేషన్ తగ్గుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..