AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blood Circulation: రక్తం తక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి.. ఇక శరీరం అంతా పోటెత్తుతుంది..

కొన్ని సందర్భాల్లో రక్త ప్రసరణ సక్రమంగా లేక గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో మీరు మంచిగా రక్తం పట్టాలన్నా.. ప్రసరణ సజావుగా సాగాలన్నా కొన్ని ఆహార పదార్థాలను మీ రోజు వారి డైట్ లో చేర్చేసుకోవాలి. అవి మనకు సాధారణంగా దొరికే పండ్లేనని నిపుణులు చెబుతున్నారు.

Blood Circulation: రక్తం తక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి.. ఇక శరీరం అంతా పోటెత్తుతుంది..
Blood Circulation
Madhu
|

Updated on: Jul 03, 2023 | 7:00 AM

Share

రక్తం.. శరీరంలో చాలా ముఖ్యమైన అంశం. పుష్కలంగా రక్తం ఉండి.. అది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రసరిస్తూ ఉంటూ మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. రక్త ప్రసరణ శరీరం అంతా సక్రమంగా ఉంటే అన్ని అవయవాలకు పుష్కలంగా ఆక్సిజన్ అందుతుంది. ముఖ్యంగా మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఒకవేళ మీకు శరీరంలో రక్తం శాతం తక్కువగా ఉన్నా.. రక్త ప్రసరణ సక్రమంగా లేకపోయినా ఇబ్బందులు తప్పవు. అలాగే రక్తం సమపాళ్లలో ఉండాలి. అతిగా చిక్కబడినా, లేకా పల్చబడినా ప్రాణానికి ముప్పు. కొన్ని సందర్భాల్లో రక్త ప్రసరణ సక్రమంగా లేక గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో మీరు మంచిగా రక్తం పట్టాలన్నా.. ప్రసరణ సజావుగా సాగాలన్నా కొన్ని ఆహార పదార్థాలను మీ రోజు వారి డైట్ లో చేర్చేసుకోవాలి. అవి మనకు సాధారణంగా దొరికే పండ్లేనని నిపుణులు చెబుతున్నారు. వాటిని మానకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆ పండ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

దానిమ్మ పండు.. ఈ పండ్లలో పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు, నైట్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శక్తివంతమైన వాసోడైలేటర్లు. దానిమ్మపండును జ్యూస్‌గా లేదా పచ్చి పండుగా అయినా తీసుకోవచ్చు. లేదా సప్లిమెంట్‌గా కూడా తీసుకోవచ్చు. దీని వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

బీట్ రూట్.. ఈ బీట్ రూట్ లో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతాయి. నైట్రిక్ ఆక్సైడ్ రక్త నాళాలను సడలించడం, విస్తరించడంలో సహాయపడుతుంది, ఇది మెరుగైన ప్రసరణను ప్రోత్సహిస్తుంది. అంతేకాక శరీరంలో రక్తం పట్టడానికి సాయపడుతుంది కూడా.

ఇవి కూడా చదవండి

ఆకు కూరలు.. బచ్చలికూర, కాలే వంటి ఆకు కూరలు అధిక మోతాదులో నైట్రేట్లను కలిగి ఉంటాయి. ఈ సమ్మేళనాలు రక్త నాళాలను విస్తరించడంలో సహాయపడతాయి. ఇది మెరుగైన ప్రసరణకు సహాయం చేస్తుంది. అంతేకాక ఆకు కూరలతో ఇతర ఆరోగ్య ప్రయోజనాలుకూడా చాలానే ఉన్నాయి.

వెల్లుల్లి.. దీనిలో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి, అలాగే అల్లిసిన్ కూడా ఉంటుంది – ఇవి రక్తనాళాల విస్తరణను ప్రోత్సహిస్తాయి. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. తినడానికి రుచిగా లేకున్నా.. ఇది ఆరోగ్యానికి చేసే మేలు మాత్రం అంతా ఇంతా కాదు. అందుకే ప్రతి రోజూ దీనిని తీసుకోవడం ఉత్తమం.

ఉల్లిపాయలు.. ఇవి కూడా ఫ్లేవనాయిడ్ యాంటీఆక్సిడెంట్లను అధికంగా కలిగి ఉంటాయి. ఇది రక్త ప్రవాహం పెరిగినప్పుడు మీ ధమనులు, సిరలు విస్తరించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె ఆరోగ్యం బాగుపడుతుంది. అలాగే గుండె నుంచి రక్త ప్రసరణ సక్రమంగా సాగుతుంది. అందుకే ప్రతి రోజూ ఉల్లిపాయలను తీసుకోవడం మంచిది.

దాల్చినచెక్క.. దీనిలో కూడా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడి, రక్త నాళాలకు నష్టం జరగకుండా కాపాడుతుంది. సరైన ప్రసరణకు ఆరోగ్యకరమైన రక్త నాళాలు అవసరం. అందుకే దీనిని అవసరం మేరకు తగు మోతాదులో తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..