Lifestyle: మలబద్ధకాన్ని లైట్‌ తీసుకుంటున్నారా.? చాలా డేంజర్‌..

దీర్ఘకాలంగా మలబద్ధకం సమస్యతో బాధపడితే కిడ్నీ సమస్యలు, జీర్ణవ్యవస్థ సమస్యలు, పైల్స్, తలనొప్పి, గ్యాస్, ఆకలి లేకపోవడం, బలహీనత, వికారం, ముఖం మీద మొటిమలు, నల్ల మచ్చలు ఇలాంటి ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్యాస్‌ సంబంధిత సమస్యలు వెంటాడుతాయి. అందుకే మలబద్ధకం...

Lifestyle: మలబద్ధకాన్ని లైట్‌ తీసుకుంటున్నారా.? చాలా డేంజర్‌..
Constipation Problem

Updated on: Mar 11, 2024 | 8:05 PM

మలబద్ధకం.. మనలో ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. అయితే వినడానికి చిన్న సమస్యే అయినా మలబద్ధకంతో ఎన్నో సమస్యలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కదలకుండా ఒకే చోట కూర్చోవడం, అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు, జంక్‌ ఫుడ్‌, నీరు తగినంత తీసుకోక పోవడం కారణంగా ఈ సమస్య వేధిస్తుంది.

దీర్ఘకాలంగా మలబద్ధకం సమస్యతో బాధపడితే కిడ్నీ సమస్యలు, జీర్ణవ్యవస్థ సమస్యలు, పైల్స్, తలనొప్పి, గ్యాస్, ఆకలి లేకపోవడం, బలహీనత, వికారం, ముఖం మీద మొటిమలు, నల్ల మచ్చలు ఇలాంటి ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్యాస్‌ సంబంధిత సమస్యలు వెంటాడుతాయి. అందుకే మలబద్ధకం సమస్యను లైట్ తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకం సమస్యను ఎక్కువ కాలం వదిలేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇంతకీ మలబద్ధకం సమస్య దరిచేరకూడదంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* మలబద్ధకం వేధిస్తే మెంతులను తీసుకోవాలని చెబుతున్నారు. చెంచాడు మెంతులను రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే తినాలని చెబుతున్నారు. ఇలా చేస్తే మలబద్ధకం సమస్య దరిచేరదు. అలాగే రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో చెంచాడు మెంతిపొడిని కలుపుకుని తీసుకుంటే మార్పు మీరు గమనిస్తారు.

* కూరగాయలతో చేసిన జ్యూస్‌ను తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య బారిన పడకుండా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బచ్చలికూర, టొమాటో, బీట్‌రూట్, నిమ్మరసం, అల్లం కలిపి చేసిన జ్యూస్‌ను తాగితే మంచి ఫలితం ఉంటుంది.

* సబ్జా గింజలు కూడా మలబద్ధకానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. అలాగే నానబెట్టిన బాదం పప్పులు, వాల్‌నట్, ఎండు ద్రాక్షలను తీసుకున్నా మేలు జరుగుతుంది.

* ప్రతీరోజూ బొప్పాయి, జామ, దోస కాయ తీసుకుంటే మలబద్ధకం సమస్య దరిచేరదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సాయంత్రం స్నాక్స్‌ సమయంలో వీటిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

* ఓట్స్‌ కూడా మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. ఓట్స్‌లోని బీటా–గ్లూకాన్స్‌ కడుపు పనితీరును ప్రోత్సహిస్తుంది. ఓట్స్‌ ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచడంలో కూడా ఉపయోగపడతాయి.

* నెయ్యి పేగుల కదలికలను వేగవంతం చేస్తుంది. ఆహారంలో నెయ్యి వేసుకని తింటే మలబద్ధకం సమస్యనుంచి బయటపడొచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..