Lifestyle: ఈ ఏడు సంకేతాలు.. కిడ్నీ సమస్యకు లక్షణాలు..

|

Oct 01, 2024 | 3:15 PM

శరీరంలో కిడ్నీ ఉండే ప్రాముఖ్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించడంలో కిడ్నీలదే కీలక పాత్ర. అలాంటి కిడ్నీల ఏమైనా సమస్యలు ఏర్పడితే ఇట్టే దాని ప్రభావం కనిపిస్తుంది. అందుకే కిడ్నీల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. కిడ్నీల పనితీరులో...

Lifestyle: ఈ ఏడు సంకేతాలు.. కిడ్నీ సమస్యకు లక్షణాలు..
ముఖ్యంగా పొత్తికడుపు నుంచి వెనుక వరకు నొప్పి.. కూర్చోవడం లేదా పడుకోవడం కూడా కష్టమయ్యే స్థాయికి చేరుకుంటుంది. కాబట్టి, ఈ లక్షణం ఉంటే మూత్రపిండ రాళ్లు, మరేదైనా మూత్రపిండాల సమస్యలు ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. ఇందుకు నిర్దిష్ట పరీక్షలు కూడా చేసుకోవాలి. అయితే కొన్ని నియమాలు పాటిస్తే కిడ్నీలో రాళ్ల సమస్యను దూరం చేసుకోవచ్చు. వాటిలో మొదటిది తాగునీరు. అయితే నీరు ఎక్కువగా తాగడం ఆరోగ్యకరమైన సంకేతం కాదు. శరీర అవసరాలకు అనుగుణంగా నీటిని తీసుకోవాలి. ఇది కిడ్నీలకు మేలు చేస్తుంది. ఒక వయోజన వ్యక్తి రోజుకు 3-4 లీటర్ల నీరు త్రాగాలి.
Follow us on

శరీరంలో కిడ్నీ ఉండే ప్రాముఖ్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించడంలో కిడ్నీలదే కీలక పాత్ర. అలాంటి కిడ్నీల ఏమైనా సమస్యలు ఏర్పడితే ఇట్టే దాని ప్రభావం కనిపిస్తుంది. అందుకే కిడ్నీల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. కిడ్నీల పనితీరులో ఏమాత్రం మార్పు వచ్చినా శరీరం వెంటనే అలర్ట్‌ చేస్తుంది. ఇంతకీ కిడ్నీ పనితీరు దెబ్బతిందని చెప్పే ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారిలో కనిపించే ప్రధాన లక్షణం నిద్రలేమి. కిడ్నీ పనితీరులో ఏమైనా లోపాలు ఉంటే, నిద్రలేమి సమస్య వెంటాడుతుంది. అందుకే దీర్ఘకాలంగా ఈ సమస్యతో బాధపడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

* కిడ్నీల్లో ఏవైనా సమస్యలు ఏర్పడితే రక్తంలో మినరల్స్, న్యూట్రియంట్స్‌ను బ్యాలెన్స్‌ చేయలేవు ఈ కారణంగా చర్మంపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా డ్రై స్కిన్‌, దురద వంటి లక్షణాలు కనిపిస్తే అది కిడ్నీ సంబంధిత సమస్యగా భావించాలి.

* కంటి చుట్టూ ఉబ్బినట్లు కనిపిస్తే కిడ్నీ సమస్య ఏదో వెంటాడుతోందని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలో ఏదైనా సమస్య తలెత్తితే శరీరంలో కొన్ని చోట్ల వాపు కనిపిస్తుంది. అందులో కంటి కింద ఒకటి.

* ఎలాంటి కారణం లేకుండా తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంటే కూడా కిడ్నీ సంబంధిత సమస్యగా భావించాలి. ముఖ్యంగా తక్కువ వయసుఉన్న వారిలో ఇలాంటి లక్షణం కనిపిస్తే అది ముమ్మాటికీ కిడ్నీ సంబంధిత సమస్యగా భావించాలి.

* పాదాల్లో, కీళ్లలో వాపు కనిపించినా వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీ సంబంధిత సమస్యలు ఉండే వారిలోనే ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

* కొందరిలో కిడ్నీల్లో సమస్యలు తలెత్తితే అది కండరాల పనితీరుపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబున్నారు. ముఖ్యంగా కండరాల్లో నొప్పులు వంటివి ప్రాథమిక లక్షణంగా చెప్పొచ్చు. ఈ లక్షణాలు కనిపించినవ వెంటనే వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. వ్యాధిని సకాలంలో గుర్తిస్తే చికిత్స కూడా అంతే సులువుగా ఉంటుంది.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..