Health Tips: జీవక్రియ సరిగ్గా లేకుంటే ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుంది. చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనుకోకుండా బరువు పెరగడం, కడుపులో గ్యాస్ సమస్యలు, అల్సర్, పేగు వ్యాధుల వంటివి ఎదురవుతాయి. అందుకే జీవక్రియను ఎప్పుడు సక్రమంగా ఉంచుకోవాలి. అయితే ఎల్లప్పుడు సరైన జీవక్రియకు సహాయం చేసే 5 పానీయాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.
1. సోంపు టీ
సోంపు జీవక్రియను పెంచడానికి చక్కడా ఉపయోగపడుతుంది. దీనిని తరచుగా మౌత్ ప్రెష్‌నర్‌గా వాడుతారు. ఇది నోటికి సువాసనతో కూడిన రుచిని అందించడంతో పాటు జీర్ణక్రియలో సహాయపడుతుంది.సోంపు టీ కడుపు ఉబ్బరం, మలబద్ధకం వదిలించుకోవడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
2. నిమ్మ డిటాక్స్ నీరు
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇందులో సిట్రిక్ యాసిడ్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని టాక్సిన్లను తొలగించి జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. నిమ్మ డిటాక్స్ నీటిలో తేనె, దాల్చినచెక్క కలపి తీసుకోవడం వల్ల ఉదర సమస్యలు తగ్గుతాయి..
3. వాము వాటర్
వాము వాటర్ జీర్ణక్రియకు బాగా పనిచేస్తాయి. శతాబ్దాలుగా దీనిని ఔషధాలలో వాడుతున్నారు. అజ్వైన్ ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. రుచిని పెంచడానికి నిమ్మకాయను రసాన్ని కూడా కలుపవచ్చు.
4. అల్లం, నిమ్మకాయ పానీయం
అల్లం, నిమ్మకాయ రసం కలిపి తాగితే జీర్ణ సమస్యలకి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇది మంట, తిమ్మిరిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి జీర్ణాశయాన్ని మెరుగుపరచడంతో పాటు మంచి డిటాక్స్ డ్రింక్‌గా పనిచేస్తుంది.
5. జీలకర్ర దాల్చిన చెక్క పానీయం
దాల్చినచెక్క యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్‌గా చెప్పవచ్చు. ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మధుమేహంతో పోరాడడంలో సహాయపడతాయి. మరోవైపు జీలకర్ర జీర్ణక్రియకు చాలా మంచిది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.