వామ్మో.. పొట్ట గుట్టలా మారిందా..? ఈ పదార్థాలను అస్సలు తినకండి.. టచ్ చేస్తే..

|

Apr 22, 2024 | 3:00 PM

ప్రస్తుత కాలంలో ఊబకాయం సమస్య చాలామందిని వేధిస్తోంది. బీపీ, గుండెపోటు లాంటి అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం స్థూలకాయం అని.. జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే అది క్రమంగా బరువు పెరిగేలా చేస్తుంది.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు, అది గుండె ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు..

వామ్మో.. పొట్ట గుట్టలా మారిందా..? ఈ పదార్థాలను అస్సలు తినకండి.. టచ్ చేస్తే..
Weight Loss
Follow us on

ప్రస్తుత కాలంలో ఊబకాయం సమస్య చాలామందిని వేధిస్తోంది. బీపీ, గుండెపోటు లాంటి అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం స్థూలకాయం అని.. జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే అది క్రమంగా బరువు పెరిగేలా చేస్తుంది.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు, అది గుండె ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.. అటువంటి పరిస్థితిలో మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తినడం ముఖ్యం.. అంతేకాకుండా.. మంచి కొలెస్ట్రాల్ మన శరీరానికి చాలా ముఖ్యమైనది.. ఇది ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడంలో సహాయపడుతుంది. అయితే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగితే అధిక రక్తపోటు, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి వంటి ట్రిపుల్ నాళాల వ్యాధితోపాటు అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

ఈ 4 ఆహారాలకు దూరంగా ఉండండి

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించాలనుకుంటే మీరు ట్రాన్స్ ఫ్యాట్ కలిగి ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది మన ఆరోగ్యానికి చాలా హానికరం.. అందుకే వైద్యులు దీనిని నివారించమని సలహా ఇస్తున్నారు. అంతేకాకుండా.. మీరు కొన్ని అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండాలి.. అవేంటో తెలుసుకోండి..

బిస్కట్లు..

బిస్కెట్లు తినడం.. కొలెస్ట్రాల్‌తో సంబంధం లేదని చాలా మందిలో అపోహ ఉంది. చాలా కుకీలలో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా తీపి, సంతృప్త వెన్నతో చేసిన బిస్కెట్‌లను తినకుండా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించుకోండి.

ఘనీభవించిన (ఫ్రోజెన్ ఫుడ్) ఆహారం..

నేడు, టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. అందుకే ఫ్రోజెన్ ఫుడ్ ట్రెండ్ మునుపటి కంటే పెరిగింది. మీరు ఎప్పుడైనా మార్కెట్ నుంచి అలాంటి వస్తువులను కొనుగోలు చేస్తే, వారి ప్యాకెట్లలోని ట్రాన్స్ ఫ్యాట్ స్థాయిని ఖచ్చితంగా తనిఖీ చేయండి. వీటికి బదులు మీరు ఇంట్లో తాజా ఆహారాన్ని వండుకోవడం మంచిది.

కేక్..

ప్యాక్ చేసిన చాలా కేక్‌ల ప్యాకెట్‌లను పరిశీలిస్తే, దానిపై ‘జీరో ట్రాన్స్ ఫ్యాట్’ అని రాసి ఉంటుంది. అయితే ఇది వినియోగదారులను మోసం చేస్తుంది. ఎందుకంటే ఈ పరిమాణం దాదాపు 0.5 గ్రాములు.. మీరు సుమారు 2 గ్రాముల ట్రాన్స్ ఫ్యాట్ తింటే, అది చక్కెరను తిన్నంత కేలరీలను ఇస్తుంది. దీంతో మీ కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభమవుతుంది.

ఫ్రెంచ్ ఫ్రైస్..

మనలో చాలా మందికి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం. దీని రుచి చాలా మందిని ఆకర్షిస్తుంది. అయితే హైడ్రోజనేటెడ్ కొవ్వును వేయించడానికి ఉపయోగిస్తారు. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..