AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్లాస్టిక్ స్పాంజ్‌తో గిన్నెలు తోముతున్నారా? పర్యావరణానికి ఎంత నష్టం చేస్తున్నారో తెలుసా

ఒకప్పుడు మన ఇళ్లలో అంట్లు తోమటానికి, గిన్నెలు కడగటానికి సహజసిద్ధమైన కొబ్బరి పీచును వాడేవారు. పర్యావరణానికి ఎలాంటి హాని చేయని ఆ ఆచారాన్ని పక్కనబెట్టి, ఆధునికత పేరుతో రంగురంగుల ప్లాస్టిక్ స్పాంజ్ స్క్రబ్బర్లను వంటగదిలోకి ఆహ్వానించాం. జిడ్డు వదిలించే ఆ మెత్తటి స్పాంజ్ స్క్రబ్బర్లు ప్రతి నిమిషం మనల్ని, మన పర్యావరణాన్ని ఎంతటి ప్రమాదంలోకి నెడుతున్నాయో తాజా పరిశోధనల్లో బయటపడింది. మనం స్పాంజ్‌ను గట్టిగా పిండిన ప్రతిసారీ, అది కంటికి కనిపించని మైక్రోప్లాస్టిక్స్‌ను నీటిలోకి విడుదల చేస్తోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ప్లాస్టిక్ స్పాంజ్‌తో గిన్నెలు తోముతున్నారా? పర్యావరణానికి ఎంత నష్టం చేస్తున్నారో తెలుసా
Washing Dishes With Sponge
Nikhil
|

Updated on: Jun 03, 2026 | 7:49 PM

Share

యూనివర్సిటీ ఆఫ్ బాన్ పరిశోధకులు కిచెన్ స్పాంజ్‌ల ప్రభావంపై సుదీర్ఘ అధ్యయనం చేశారు. ఇందుకోసం ‘స్పాంజ్‌బాట్’ అనే ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించి పరీక్షలు నిర్వహించారు. సగటున ఒక వ్యక్తి వాడే స్క్రబ్బర్ల వల్ల ఏడాదికి 0.68 గ్రాముల నుంచి 4.21 గ్రాముల మైక్రోప్లాస్టిక్స్ నీటిలో కలుస్తున్నాయని తేలింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఈ స్పాంజ్‌లను వాడుతుండటంతో, ఇది వందల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలుగా మారుతోంది. ఇవి డ్రైనేజీ వ్యవస్థల ద్వారా నదులు, సముద్రాల్లోకి చేరి పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి.

నీటి వృథా..

ఈ పరిశోధనలో ప్లాస్టిక్ కంటే మించిన మరొక ఆందోళనకరమైన నిజం బయటపడింది. గిన్నెలు కడిగే ప్రక్రియలో పర్యావరణానికి జరుగుతున్న మొత్తం నష్టంలో, మైక్రోప్లాస్టిక్స్ వాటా కంటే నీటి వృథా వాటాయే అత్యధికమని శాస్త్రవేత్తలు గుర్తించారు. చేత్తో అంట్లు తోమేటప్పుడు ట్యాప్ ఆన్ చేసి ఉంచడం వల్ల జరిగే పర్యావరణ నష్టం ఏకంగా 85 నుండి 97 శాతం వరకు ఉంటుందట. మనం నిరంతరం వృథా చేస్తున్న నీరు, ప్లాస్టిక్ స్పాంజ్ కంటే పెద్ద ముప్పును కలిగిస్తోంది.

ఈ ముప్పును తగ్గించడానికి కొన్ని చిన్నపాటి మార్పులు సరిపోతాయి

  • ఎకో-ఫ్రెండ్లీ ఆప్షన్స్: ప్లాస్టిక్ స్పాంజ్‌లకు బదులు పాతకాలం నాటి కొబ్బరి పీచు లేదా సహజ సిద్ధమైన పీచుతో చేసిన స్క్రబ్బర్లను వాడటం అలవాటు చేసుకోండి.
  • నీటి పొదుపు: గిన్నెలు తోమేటప్పుడు ట్యాప్ ఆన్ చేసి ఉంచకుండా, అవసరమైనప్పుడు మాత్రమే నీటిని వాడుతూ ట్యాప్ కట్టేయడం ప్రాక్టీస్ చేయండి.
  • మితమైన వాడకం: ఒకే స్పాంజ్‌ను ఎక్కువ రోజులు వాడటం ద్వారా మైక్రోప్లాస్టిక్స్ విడుదలను కొంత వరకు తగ్గించవచ్చు.

ఆరోగ్యకరమైన, పర్యావరణ హితమైన వంటగదిని నిర్మించుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఆధునిక సౌకర్యాల కంటే మన పర్యావరణం ముఖ్యం. ప్రకృతికి మేలు చేసే పాతకాలపు అలవాట్లను మళ్ళీ మన జీవితంలోకి ఆహ్వానిద్దాం. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించి, నీటిని పొదుపు చేస్తూ భవిష్యత్తు తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందిద్దాం.

Follow Us