AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏది ఆరోగ్యానికి అమృతం.. ఏది ప్రమాదం? దేశవాళీ ఆవు నెయ్యికి ప్రపంచవ్యాప్తంగా ఎందుకంత డిమాండ్!

భారతదేశంలో ప్రస్తుతం పల ఉత్పత్తి కోసం ఎక్కువగా హైబ్రిడ్ ఆవులను పెంచుతున్నారు. ఇవి ఎక్కువ పాలు ఇస్తాయి కాబట్టి వాణిజ్యపరంగా వీటికి ప్రాధాన్యత ఉంది. వీటి నుండి వచ్చే నెయ్యిని 'A1 టైప్' అంటారు. అయితే, మన దేశవాళీ ఆవుల నుండి వచ్చే నెయ్యిని 'A2 టైప్' అంటారు. పాలు తక్కువ ఇచ్చినా, ఏ2 నెయ్యిలో ఉన్న పోషకాలు అమోఘం.

ఏది ఆరోగ్యానికి అమృతం.. ఏది ప్రమాదం? దేశవాళీ ఆవు నెయ్యికి ప్రపంచవ్యాప్తంగా ఎందుకంత డిమాండ్!
A1 Vs A2 Ghee.jpg
Nikhil
|

Updated on: Mar 25, 2026 | 2:20 PM

Share

నేటి కాలంలో పాలు, పెరుగు, నెయ్యి వంటి పాల ఉత్పత్తుల వాడకంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా ‘నెయ్యి’ విషయంలో వస్తున్న మార్పులు ఆశ్చర్యకరం. మార్కెట్లో దొరికే సాధారణ నెయ్యి కంటే ‘A2 టైప్ నెయ్యి’ కు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అసలు ఈ A2 నెయ్యి అంటే ఏమిటి? హైబ్రిడ్ ఆవుల నెయ్యికి, మన దేశవాళీ ఆవుల నెయ్యికి ఉన్న తేడా ఏంటో వివరంగా తెలుసుకుందాం.

ఎందుకు ప్రత్యేకం?

దేశవాళీ ఆవు పాలలోని నెయ్యిలో ‘బీటా-కేసిన్’ అనే ప్రత్యేకమైన ప్రోటీన్ ఉంటుంది. ఇది హైబ్రిడ్ ఆవుల నెయ్యి కంటే రుచిగా ఉండటమే కాకుండా అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అందుకే దీనిని ఆయుర్వేద మరియు సిద్ధ వైద్య విధానాలలో విరివిగా ఉపయోగిస్తారు.

ప్రయోజనాలు

* జీర్ణక్రియ మెరుగుదల- ఏ2 నెయ్యిలో ఉండే ఒక రకమైన యాసిడ్ జీర్ణాశయ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను నివారించి జీర్ణక్రియను సాఫీగా చేస్తుంది. * పోషకాల గని- ఇందులో విటమిన్ ఏ, డి, ఇ, కె లతో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని అందిస్తాయి. * చర్మం, జుట్టు- ఏ2 నెయ్యిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది మరియు జుట్టు పెరుగుదల మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. * ముప్పాశ దోషాల నివారణ- సిద్ధ వైద్యం ప్రకారం, శరీరంలో వ్యాధులకు మూలకారణమైన వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేయడంలో ఏ2 నెయ్యి అద్భుతంగా పనిచేస్తుంది.

జాగ్రత్తలు తప్పనిసరి..

ఏ2 నెయ్యి ఎంతో ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ, దానిని అమితంగా తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా సరే మితంగా తీసుకున్నప్పుడే అది ఔషధంగా పనిచేస్తుంది. మార్కెట్లో లభించే సాధారణ నెయ్యి కంటే స్వచ్ఛమైన దేశవాళీ ఆవు నెయ్యి (A2) ధర కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ, అది మన ఆరోగ్యానికి ఇచ్చే భరోసా చాలా పెద్దది. స్వచ్ఛమైన ఆహారమే ఆరోగ్యానికి పునాది అని నమ్మేవారు ఏ2 నెయ్యిని తమ డైట్‌లో భాగం చేసుకోవడం మంచిది.

Follow Us
వాస్తు:ఎంత దగ్గరివారైనా సరే, ఈ 3 మొక్కలు గిఫ్ట్‌గా ఇవ్వకూడదు
వాస్తు:ఎంత దగ్గరివారైనా సరే, ఈ 3 మొక్కలు గిఫ్ట్‌గా ఇవ్వకూడదు
ప్లేయింగ్ 11లో వైభవ్‌ను చేర్చొద్దు.. మాఇజ్జత్ తీసిసారేస్తాడు
ప్లేయింగ్ 11లో వైభవ్‌ను చేర్చొద్దు.. మాఇజ్జత్ తీసిసారేస్తాడు
ఓటీటీలోకి 'పెద్ది'! కొత్త సీన్లతో కలిపి ఆరోజు నుంచే స్ట్రీమింగ్!
ఓటీటీలోకి 'పెద్ది'! కొత్త సీన్లతో కలిపి ఆరోజు నుంచే స్ట్రీమింగ్!
చుక్క నూనె లేకుండా కుక్కర్‌లో పూరీలు.. ఎలా పొంగుతున్నాయో చూస్తే
చుక్క నూనె లేకుండా కుక్కర్‌లో పూరీలు.. ఎలా పొంగుతున్నాయో చూస్తే
ఏంటీ.. ఈ చిన్నారి ఆ పాన్ ఇండియా నటి ఆ..?
ఏంటీ.. ఈ చిన్నారి ఆ పాన్ ఇండియా నటి ఆ..?
ఎరుపు రంగు మీ అదృష్టాన్ని మార్చగలదా? ఈ రంగు ఎవరికి శుభం, ఎవరికి..
ఎరుపు రంగు మీ అదృష్టాన్ని మార్చగలదా? ఈ రంగు ఎవరికి శుభం, ఎవరికి..
ఫోన్‌కు ఒక రోజులో ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాలో తెలుసా..?
ఫోన్‌కు ఒక రోజులో ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాలో తెలుసా..?
'చావు అంచున ఉన్నాను.. కాపాడండి'.. టాలీవుడ్ నటి షాకింగ్ వీడియో
'చావు అంచున ఉన్నాను.. కాపాడండి'.. టాలీవుడ్ నటి షాకింగ్ వీడియో
అందమైన అమ్మాయి పాదాలతో చేసిన రొట్టె..అదంటే మగాళ్లకు పిచ్చి..!
అందమైన అమ్మాయి పాదాలతో చేసిన రొట్టె..అదంటే మగాళ్లకు పిచ్చి..!
జస్ట్ 2 గంటల్లో దుబాయ్‌కి.. విమానం కంటే వేగం.. ఈ సూపర్ ట్రైన్..
జస్ట్ 2 గంటల్లో దుబాయ్‌కి.. విమానం కంటే వేగం.. ఈ సూపర్ ట్రైన్..