తెలంగాణలో పువ్వుని పూజించే బతుకమ్మని పేర్చడానికి ఉపయోగించే పువ్వుల్లో ఒకటి తంగేడు పువ్వు. బంగారు రంగులో గుత్తులు గుత్తులుగా అందంగా కనిపించే ఈ తంగేడు పువ్వులో అనేక ఔషధ గుణాలున్నాయి. అసలు తంగేడు మొక్క అనేక ఆరోగ్య సమస్యలను తీర్చే మంచి ఔషధం.
తయారీ విధానం: ముందుగా తంగేడు పువ్వును తీసుకుని పువ్వులు మాత్రమే అంటే పసుపు రంగులో ఉన్న పువ్వులను తీసుకుని శుభ్రంగా వలిచి కడగాలి. చింత పండును కొంచెం నీరు పోసుకుని నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వేడి ఎక్కిన తర్వాత తంగేడు పువ్వులు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ నూనేలో పచ్చిమిర్చి, నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లి వేసి వేయించాలి. ఇప్పుడు రోలుని శుభ్రం చేసుకుని మొదట వేయించిన పచ్చిమిర్చి, నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లి వేసుకుని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసి చింత పండు వేసి బాగా నూరాలి. తర్వాత వేయించిన తంగేడు పువ్వులను వేసి బాగా నూరు కోవాలి. ఇప్పుడు పోపుకోసం తీసుకున్న దినుసులను వేయించి.. వాటిని రెడీ చేసుకున్న తంగేడు పువ్వుల పచ్చడిలో వేసి కలుపుకోవాలి. అంతే తంగేడుపూల పచ్చడి రెడీ. రోలు రోకలి లేని వారు మిక్సిలో వేసుకుని కూడా పచ్చడి తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడి అన్నంలోకి ఇడ్లీ, దోశల్లోకి చాలా బాగుంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..