AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Switch Board Cleaning Tips: మురికి పట్టిన స్విచ్‌బోర్డులు నిమిషాల్లో మెరిసిపోవాలంటే ఇదే సీక్రెట్!

ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచినా, స్విచ్‌బోర్డుల విషయంలో మాత్రం చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. తెల్లటి స్విచ్‌బోర్డులు కాలక్రమేణా దుమ్ము, చేతుల మురికి, నూనె మరకల కారణంగా పసుపు లేదా నల్లటి రంగులోకి మారిపోతాయి. దీంతో ఇంటి అందం కూడా తగ్గిపోతుంది. అయితే ఖరీదైన క్లీనర్లు కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉండే కొన్ని సాధారణ వస్తువులతోనే స్విచ్‌బోర్డులను కొత్తవాటిలా మెరిపించవచ్చు.

Switch Board Cleaning Tips: మురికి పట్టిన స్విచ్‌బోర్డులు నిమిషాల్లో మెరిసిపోవాలంటే ఇదే సీక్రెట్!
Switch Board Cleaning Tips
Bhavani
|

Updated on: Sep 09, 2026 | 5:48 PM

Share

స్విచ్‌బోర్డులను శుభ్రం చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ముందుగా మెయిన్ స్విచ్‌ను ఆఫ్ చేయాలి. అలాగే నేరుగా నీరు పోయడం లేదా పూర్తిగా తడిసిన గుడ్డతో తుడవడం చేయకూడదు. ఇలా చేస్తే విద్యుత్ షాక్ ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు స్విచ్‌బోర్డులను సులభంగా శుభ్రం చేసే చిట్కాలను తెలుసుకుందాం.

1. నెయిల్ పాలిష్ రిమూవర్‌తో మొండి మరకలకు చెక్

నెయిల్ పాలిష్ రిమూవర్‌ను కొద్దిగా దూదిపై తీసుకుని, స్విచ్‌బోర్డ్‌పై మెల్లగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల నూనె మరకలు, పసుపు రంగు మచ్చలు సులభంగా తొలగిపోతాయి. అయితే ఎక్కువగా ఉపయోగించకుండా జాగ్రత్త పడాలి.

2. బేకింగ్ సోడా – టూత్‌పేస్ట్ మిశ్రమం

ఒక చెంచా బేకింగ్ సోడాలో కొద్దిగా టూత్‌పేస్ట్ కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. దీన్ని పాత టూత్‌బ్రష్‌తో స్విచ్‌బోర్డ్‌పై రాసి రెండు నిమిషాల తర్వాత మెల్లగా రుద్దాలి. అనంతరం పొడి గుడ్డతో తుడిస్తే బోర్డు మెరిసిపోతుంది.

3. రబ్బింగ్ ఆల్కహాల్ ఉపయోగించండి

మొండి మరకలు తొలగించడానికి రబ్బింగ్ ఆల్కహాల్ కూడా బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా ఆల్కహాల్‌ను కాటన్‌పై తీసుకుని బోర్డును తుడిస్తే మురికి, దుమ్ము సులభంగా తొలగిపోతాయి.

4. వెనిగర్ – నిమ్మరసం చిట్కా

రెండు టీ స్పూన్ల తెల్ల వెనిగర్‌లో ఒక టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని గుడ్డ లేదా బ్రష్ సహాయంతో స్విచ్‌బోర్డ్‌పై ఉపయోగిస్తే మరకలు తొలగి బోర్డు తెల్లగా మారుతుంది.

5. శుభ్రం చేసే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు

ముందుగా మెయిన్ పవర్‌ను ఆఫ్ చేయాలి.

తడి గుడ్డను ఎక్కువగా ఉపయోగించకూడదు.

పిల్లలు దగ్గర లేకుండా చూసుకోవాలి.

శుభ్రం చేసిన తర్వాత పూర్తిగా ఆరిన తరువాతే విద్యుత్ సరఫరా ఆన్ చేయాలి.

గమనిక: విద్యుత్ పరికరాలను శుభ్రం చేసే సమయంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. సందేహం ఉంటే ఎలక్ట్రిషియన్ సహాయం తీసుకోవడం మంచిది.

Follow Us