మీరు పొట్టు మినప్పప్పుని వాడుతున్నారా.. అయితే ఈ ప్రయోజనాలన్ని మీకే…?

September 08

Jyothi Gadda

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: పొట్టు మినపప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

గుండె ఆరోగ్యం: దీనిలోని మెగ్నీషియం, పొటాషియం రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె సంబంధిత జబ్బులు రాకుండా కాపాడుతుంది.

డయాబెటిస్ నియంత్రణ: ఈ పప్పులో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా కలిగిన ఆహారం. దీనిలోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అదుపు చేసి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది.

ఎముకల బలం: ఇందులో కాల్షియం, పాస్ఫరస్, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను పెంచి, వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

శరీరానికి అపారమైన శక్తి: మినపప్పులో ప్రొటీన్, ఐరన్ అధికంగా ఉంటాయి. ఐరన్ ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచి రక్తహీనతను నివారిస్తుంది, దీనివల్ల రోజంతా శరీరం ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటుంది.

నరాల బలహీనత తగ్గింపు: మినపప్పును ఆయుర్వేదంలో నరాల పునరుజ్జీవనానికి ఉపయోగిస్తారు. ఇది నరాల బలహీనతను తగ్గించి, పక్షవాతం వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇవ్వడంలో సహాయపడుతుంది.

చర్మ సౌందర్యం: దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మానికి మంచి పోషణను ఇస్తాయి. మొటిమలు, మచ్చలను తగ్గించడమే కాకుండా చర్మంపై ముడతలు రాకుండా వృద్ధాప్య ఛాయలను అడ్డుకుంటాయి.

జుట్టు పెరుగుదల: పొట్టు మినపప్పులోని ప్రొటీన్లు, మినరల్స్ కుదుళ్లకు తగినంత పోషణ అందిస్తాయి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి, కుదుళ్లను బలంగా మార్చి, జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

రుతుక్రమ సమస్యలు: మహిళల్లో వచ్చే రుతుక్రమ నొప్పులు, శరీర బలహీనతను తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. గర్భిణులు, బాలింతలకు అవసరమైన కండరాల బలాన్ని, శక్తిని అందిస్తుంది.