Fire In Dreams: కలలో మంటల్లో తగలబడుతున్న ఇల్లు కనిపించిందా.? అది దేనికి సంకేతమో తెలుసుకోండి.!

| Edited By: Phani CH

Jun 15, 2021 | 7:06 AM

నిద్రపోయేటప్పుడు ప్రజలందరూ కలలు కనటం సహజం. అయితే తరచుగా కొంతమంది తమ కలలో అగ్నిని చూస్తుంటారు. దాన్ని ఒక పీడకలగా...

Fire In Dreams: కలలో మంటల్లో తగలబడుతున్న ఇల్లు  కనిపించిందా.? అది దేనికి సంకేతమో తెలుసుకోండి.!
House
Follow us on

నిద్రపోయేటప్పుడు ప్రజలందరూ కలలు కనటం సహజం. అయితే తరచుగా కొంతమంది తమ కలలో అగ్నిని చూస్తుంటారు. దాన్ని ఒక పీడకలగా భావిస్తుంటారు. అయితే కలలో అగ్ని కనిపించడం కీడుకు సంకేతం కాదని స్వప్న శాస్త్రం ఆధారంగా పండుతులు పేర్కొంటున్నారు. కలలో అగ్ని కనిపించడం చెడుకు సంకేతం కాదని.. శుభమేనని వారు చెబుతున్నారు. పదండీ ఈరోజు మీకు కలలో అగ్ని కనిపిస్తే దేని సంకేతం.? అన్నది తెలుసుకుందాం..

మనిషి ఎన్నో రకాలుగా కలలు కంటుంటాడు. కొన్నిసార్లు అతడి కలలో అగ్ని వేర్వేరు రూపాల్లో కనిపిస్తుంది. ఒక కాగడా రూపంలో గానీ, విచ్చిన్నంగా జ్వలిస్తున్నట్లు, ఒక దీపం రూపంలో, లేదా పెద్దగా ఇళ్లు, చెట్లు, లేదా మనిషి దహించుకుపోతున్నట్లుగా కలలు కనవచ్చు. కలల్లో ఇలా విభిన్నంగా కనిపించే అగ్ని అసలు దేనికి సంకేతమో తెలుసా.?

ఒక కాగడా రూపంలో ఎవరైనా మీచేతికి అందించినట్లు కల వస్తే.. అది మంచిదే అని పండితులు చెబుతున్నారు. అలా కనిపిస్తే మీకు విజయం కలుగుతుందని అని అర్ధమట. చిన్న మంట రూపంలో కనిపించినా విజయానికి సంకేతమని అంటున్నారు. అలాగే మీ అప్పులు తీరిపోతాయట. ఇక స్వప్నంలో గనక అగ్ని కనిపిస్తే.. వివాహం కానివారికి పెళ్లి యోగ్యం ఉంటుందట. సంతానం యోగం, ధన సంపాదన వంటివి కూడా జరుగుతాయట. మన పూర్వీకులు ధనం రావాలంటే అగ్ని దేవుడిని పూజించమంటారని.. అగ్నిని పూజిస్తే ధనప్రాప్తి కలుగుతుందని పండితులు పేర్కొన్నారు.

అగ్ని కలలోకి వస్తే చెడు ఫలితాలు ఎప్పుడు కలుగుతాయి..

ఒకవేళ మన కలలో అగ్నికి ఊరు మొత్తం తగలబడిపోతున్నట్లు కనిపిస్తే.. అది అశుభ ఫలితమని పండితులు చెబుతున్నారు. అలాగే మీరు ఇంట్లో ఉన్నప్పుడు చుట్టూ అగ్ని అంటుకున్నట్లు కలలో కనిపిస్తే.. అప్పుడు మీరు అప్పుల వలయంలో చిక్కుకుంటారని, ఆపదల్లో చిక్కుకోబోతున్నారని దాని అర్ధం. ఇలాంటి స్వప్నం వచ్చినప్పుడు.. రామాయణం ఉన్న త్రిజట స్వప్న వృతాంతం, లేదా స్కందుని ఆరాధన, ఈశ్వరాభిషేకం చేస్తే ఇలాంటి స్వప్నాలు రాకుండా ఉంటాయి. కాగా, కలలు ఎప్పుడూ కూడా భవిష్యత్తును సూచిస్తాయని.. మీరు ఎక్కడైనా చూసిన అంశం గానీ, విన్నది గానీ, ఊహించింది గానీ కలలో వస్తే.. వాటిని పరిగణనలోకి తీసుకోవద్దని.. ఎలాంటి ఇబ్బంది ఉండదని పండుతులు చెబుతున్నారు.

Also Read: మరో ‘వార్‌’కు తెరలేపిన కిమ్.. క్రూరత్వానికి పరాకాష్ట.. తేడా వస్తే మరణశిక్షే.!