Dry Amla: ఉసిరి ఆరోగ్యాల సిరి.. పొడవునా ఇలా తీసుకోండి.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం..

|

Jul 23, 2024 | 6:56 PM

అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే వృద్ధులకు ఉసిరి తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా పార్కిన్ స‌న్స్, అల్జీమ‌ర్స్, డిమెన్ షియా అనే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వృద్ధులకు పెద్ద ఉసిరి లేదా రాతి ఉసిరి దివ్య ఔషదం అని శాస్త్రీయంగా నిరూపించబ‌డిందని నిపుణులు చెబుతున్నారు. అందుకనే ఏమో మన ఋషులు ఏడాది పొడవునా ఉసిరి తినే ఆహారంలో ఒక భాగంగా చేసుకోమని మ‌న ఆచారాల్లో భాగం చేశారు. ఉసిరి పచ్చడి, ఉసిరి తొక్కు ఇలా వివిధ రూపాల్లో ఉసిరిని ఏడాది మొత్తం తినేవారు. అయితే ఇప్పుడు ఉసిరి పచ్చడిని తింటున్నారు.

Dry Amla: ఉసిరి ఆరోగ్యాల సిరి.. పొడవునా ఇలా తీసుకోండి.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం..
Dry Amla
Follow us on

ఉసిరి కాయలు సీజన్ వచ్చేస్తుంది. ఉసిరి చెట్టు లో ప్రతిదీ ఔషధ గుణాలను కలిగి ఉంది. ఉసిరి కాయలు, గింజలు, ఆకులు, చెట్టు బెరడు, వెళ్ళు, పువ్వులు ఇలా అన్నిటిని ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఉసిరి ఆరోగ్యాన్ని మాత్రమే కాదు అందాన్ని కూడా ఇస్తుంది. విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరి కాయ మలబద్ధకానికి దివ్యౌషధం. అయితే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే వృద్ధులకు ఉసిరి తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా పార్కిన్ స‌న్స్, అల్జీమ‌ర్స్, డిమెన్ షియా అనే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వృద్ధులకు పెద్ద ఉసిరి లేదా రాతి ఉసిరి దివ్య ఔషదం అని శాస్త్రీయంగా నిరూపించబ‌డిందని నిపుణులు చెబుతున్నారు. అందుకనే ఏమో మన ఋషులు ఏడాది పొడవునా ఉసిరి తినే ఆహారంలో ఒక భాగంగా చేసుకోమని మ‌న ఆచారాల్లో భాగం చేశారు. ఉసిరి పచ్చడి, ఉసిరి తొక్కు ఇలా వివిధ రూపాల్లో ఉసిరిని ఏడాది మొత్తం తినేవారు. అయితే ఇప్పుడు ఉసిరి పచ్చడిని తింటున్నారు.. కానీ ఇతర రూపాల్లో తీసుకోవడం పై పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదు. అయితే ఉసిరి కాయలు దొరికే సమయంలో వాటిని ఎండ బెట్టి నిల్వ చేసుకుని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

ఉసిరికాయల సీజన్ మొదలైన తర్వాత ఎక్కువగా దొరికే సమయంలో ఉసిరిని ముక్కలుగా కోసి ఎండలో పెట్టి వాటిని ఎండబెట్టుకోవాలి. తర్వాత ఆ ఎండిన ఉసిరి ముక్కలను తడి తగలకుండా గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా ఎండ బెట్టిన ఉసిరి ముక్కలను రోజూ ఉదయం, సాయంత్రం భోజ‌నం చేసిన అనంతరం తినాలి. ఇలా చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఈ ఎండ బెట్టిన ఉసిరి ముక్కలను నీటిలో నానా బెట్టుకుని కూడా తినవచ్చు. వీటిని తినడం వలన నోట్లో ఉండే చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. అంతేకాదు ఉసిరికాయ‌ల్లో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్, కెఫిక్ యాసిడ్, ఎలాజిక్ యాసిడ్ లు మెదడుకు హానిని కలిగించే ప్రోటీన్ల ఉత్పత్తిని తగ్గిస్తాయి.

అంతేకాదు వృద్ధులకు వచ్చే పార్కిన్ స‌న్స్, అల్జీమ‌ర్స్, డిమెన్ షియా అనే మెదడుకి సంబంధించిన సమస్యలను తగ్గించడంలో మంచి సహాయకారిగా పనిచేస్తుంది. ఈ ఉసిరి ముక్కలను నోట్లో వేసుకుని చప్పరించడం వలన చక్కటి ఆరోగ్యం సొంతం అవుతుంది. కనుక ఉసిరికాయలు బాగా దొరికే సమయంలో వీటిని ముక్కలుగా చేసి ఎండబెట్టుకుని ఏడాది పొడవునా తీసుకోమని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)