AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: ఆల్కహాల్ తాగడం సడన్ గా మానేస్తే ఏమవుతుందో తెలుసా..? ఇది చూసేయండి

మితిమీరిన మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అయినా చాలా మంది మద్యం తాగడం మానుకోవాలని అనుకోరు. అయితే మద్యం రోజూ తాగినా అప్పుడప్పుడు తాగినా సరే ఇది శరీరంలోకి వెళ్లి కీలక అవయవాలపై ప్రభావం చూపుతుంది.ఆల్కహాల్ శరీరంలోకి వెళ్లిన తర్వాత ఏం జరుగతుందనే విషయం చాలా మందికి తెలియదు.

Lifestyle: ఆల్కహాల్ తాగడం సడన్ గా మానేస్తే ఏమవుతుందో తెలుసా..? ఇది చూసేయండి
Alcohol
Ravi Kiran
|

Updated on: Jun 09, 2025 | 7:35 AM

Share

మితిమీరిన మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అయినా చాలా మంది మద్యం తాగడం మానుకోవాలని అనుకోరు. అయితే మద్యం రోజూ తాగినా అప్పుడప్పుడు తాగినా సరే ఇది శరీరంలోకి వెళ్లి కీలక అవయవాలపై ప్రభావం చూపుతుంది.ఆల్కహాల్ శరీరంలోకి వెళ్లిన తర్వాత ఏం జరుగతుందనే విషయం చాలా మందికి తెలియదు. అయితే రోజూ మద్యం తాగే వారు షడన్​ గా మానేస్తే చాలా ఇబ్బందులు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఉన్నట్టుండి ఆల్కహాల్​ తీసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. .

ఆల్కహాల్ తాగడం సడన్ గా మానేస్తే కొందరిలో తీవ్రమైన సమస్యలు కనిపిస్తాయి. దీనినే విత్‌డ్రాయల్ సిండ్రోమ్ అని పిలుస్తారు. అయితే మద్యం హఠాత్తుగా మానేస్తే కొంతమందిలో టెన్షన్, అలసట కనిపిస్తాయి. కొన్నేళ్లు మద్యం తాగి మానేస్తే మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. కొంతమంది మద్యం తాగడం మానిస్తే చెవుల్లో పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయట.. అంతే కాదు ఎవరో తమను పిలుస్తున్నట్టు కూడా అనిపిస్తుందట. దీనినే ఆల్కహాల్ ప్రేరేపిత బ్రాంతి అంటారు.

ఏళ్ల తరబడి మద్యం తాగి.. ఏదో ఒక కారణంతో తాగడం మానేస్తే వారిలో మూడు రోజుల్లోపు మానసిక సమస్యలు తలెత్తుతాయి. కోపం, ముందు ఏం ఉందో తెలియని పరిస్థితి, అయోమయంలోకి వెళ్తారు. కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. చాలా మంది సరైన ఆహారం తీసుకోకుండా రేయింబవళ్లు మద్యం తాగుతుంటారు. అలాంటి వారిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. కామెర్లు రక్తం గడ్డకట్టడంతో పాటు మెదడు కణజాలాన్ని ప్రభావితం చేస్తుంది.

షడన్​ గా ఆల్కహాల్ మానేయడం వల్ల వచ్చే మానసిక సమస్యలు పెరిగితే ఆ తర్వాతి దశలో అది న్యూరోలాజికల్ సమస్యలకు దారితీస్తుంది. ఈ దశలో వారు అన్నింటినీ మర్చిపోతుంటారు. ఇది ఎలా ఉంటుందంటే అకస్మాత్తుగా ఒక ప్రశ్న అడిగి దానికి సమాధానం చెప్పేలోపే వారూ ఆ ప్రశ్న అడిగారా లేదా అన్న విషయాన్ని కూడా మర్చిపోతారు.

తమకు మతిమరుపు ఉందనే విషయాన్ని చెప్పకుండా ఏదో ఒకటి చెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు. దీనికి తోడు నరాలకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్​ తీసుకోవడం మానేయాలనుకొనే వారు క్రమేణ తగ్గించుకుంటూ రావాలి. ఒక నెల పాటు వారానికి రెండు సార్లు.. వారానికోసారి తగ్గించుకుంటే వస్తే శరీరంపై ఎలాంటి దుష్ప్రభవాలు ఉండవు. వైద్యులు చెబుతున్నారు.

Follow Us
నెలకు రూ.1.56 లక్షల జీతంతో ఇన్‌స్యూరెన్స్‌ కంపెనీలో 225 ఉద్యోగాలు
నెలకు రూ.1.56 లక్షల జీతంతో ఇన్‌స్యూరెన్స్‌ కంపెనీలో 225 ఉద్యోగాలు
వివో నుంచి కొత్త ఇయర్ బడ్స్.. ఈ ఫీచర్లు చూశారా..?
వివో నుంచి కొత్త ఇయర్ బడ్స్.. ఈ ఫీచర్లు చూశారా..?
అమెరికాలో H-1B ఉద్యోగులకు షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దు?..
అమెరికాలో H-1B ఉద్యోగులకు షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దు?..
భయంకరమైన మలుపులు.. క్లైమాక్స్‏లోనే అసలు ట్విస్ట్..
భయంకరమైన మలుపులు.. క్లైమాక్స్‏లోనే అసలు ట్విస్ట్..
అబ్బాయి శరీరంలో గర్భాశయం.. పిల్లలు పుట్టట్లేదని హాస్పిటల్‌కు..
అబ్బాయి శరీరంలో గర్భాశయం.. పిల్లలు పుట్టట్లేదని హాస్పిటల్‌కు..
మొండి షుగర్ వ్యాధి, రక్తహీనతను తరిమికొట్టే పవర్ఫుల్ ఆకు..
మొండి షుగర్ వ్యాధి, రక్తహీనతను తరిమికొట్టే పవర్ఫుల్ ఆకు..
వినాయకుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటున్నారా? ఈ విషయాలు తెలిస్తేనే
వినాయకుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటున్నారా? ఈ విషయాలు తెలిస్తేనే
బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీ చేరుకున్న పలు దేశాల నేతలు..
బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీ చేరుకున్న పలు దేశాల నేతలు..
గచ్చిబౌలిలో దారుణం.. అందరూ చూస్తుండగానే హత్య!
గచ్చిబౌలిలో దారుణం.. అందరూ చూస్తుండగానే హత్య!
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి నాలుగు బెనిఫిట్స్.. చాలామందికి ఈ విషయాలు.
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి నాలుగు బెనిఫిట్స్.. చాలామందికి ఈ విషయాలు.