Stress and Hypertension: అతి ఆలోచనలతో బీపీ టెన్షన్‌.. సకాలంలో మనసుకు రిపేర్‌ చేయకుంటే గుండెకు చేటు

అతిగా ఆలోచించడం, మానసిక ఒత్తిడి నేటి కాలంలో సర్వసాధారణమై పోయింది. చిన్న విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించే ధోరణి నానాటికీ పెరిగిపోతుంది. ఆ అలవాటు మనసుపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ అలవాటు మానసిక ఆరోగ్యాన్నే కాకుండా..

Stress and Hypertension: అతి ఆలోచనలతో బీపీ టెన్షన్‌.. సకాలంలో మనసుకు రిపేర్‌ చేయకుంటే గుండెకు చేటు
Overthinking And High Blood Pressure

Updated on: May 11, 2026 | 8:54 PM

నేటి వేగవంతమైన జీవనశైలిలో అతిగా ఆలోచించడం, మానసిక ఒత్తిడి సర్వసాధారణమై పోయాయి. చిన్న విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించే ధోరణి నానాటికీ పెరిగిపోతుంది. ఆ అలవాటు మనసుపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ అలవాటు మానసిక ఆరోగ్యాన్నే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందట. ఈ విషయం కొన్నిసార్లు మనం గ్రహించకపోవచ్చు. అసలు అతిగా ఆలోచించడానికి, బీపీకి మధ్య సంబంధం ఏమిటో? అతిగా ఆలోచించడాన్ని ఎలా నివారించాలో? ఇక్కడ తెలుసుకుందాం..

అతిగా ఆలోచించడం – రక్తపోటు మధ్య సంబంధం

వైద్యుల అభిప్రాయం ప్రకారం ఒక వ్యక్తి నిరంతరం ఒత్తిడికి, ఆందోళనకు గురైనప్పుడు శరీరంలో కొన్ని హార్మోన్లు ఉత్తేజితమవుతాయి. ఇవి హృదయ స్పందన రేటును పెంచి, రక్త ప్రసరణను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే అది గుండె ఆరోగ్యానికి కూడా ప్రమాదం కలిగిస్తుంది. కానీ ప్రతి వ్యక్తి శరీరం భిన్నంగా ఉంటుంది. కాబట్టి దాని ప్రభావం కూడా మారుతూ ఉంటుంది. కొందరిలో తక్షణ ప్రభావాలు కనిపించకపోయినా దీర్ఘకాలిక ఒత్తిడితో ఈ సమస్య తీవ్రతరం కావచ్చు. అందువల్ల మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం.

అతిగా ఆలోచించడాన్ని ఎలా నియంత్రించుకోవాలి?

అతిగా ఆలోచించడాన్ని నియంత్రించడానికి రోజువారీ దినచర్యలో కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ధ్యానం, యోగా, వ్యాయామం మనసును ప్రశాంతపరచడంలో సహాయపడతాయి. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. దానితో పాటు తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. నిద్రలేమి శరీరాన్ని, మనసును రెండింటినీ అలసిపోయేలా చేస్తుంది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండి, సానుకూల కార్యకలాపాలలో నిమగ్నమవ్వడం మంచిది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అతిగా ఆలోచించడం కూడా శరీరంపై ఒత్తిడిని పెంచుతుంది. అందువల్ల నిపుణుల సలహా మేరకు మనసును సమతుల్యంగా ఉంచుకోవడం అలవరచుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us