Soaked Vs Dry Dates: నానబెట్టినవా.. ఎండినవా.. ? ఖర్జూరాలు ఎలా తీసుకుంటే మంచిది..

ఎడారి దేశాలతోపాటు అనేక ప్రదేశాలలో ఖర్జూరాలకు విశిష్ట ఆదరణ ఉంది. సహజ తీపి కలిగిన ఈ పండు ప్రకృతి అందించిన ప్రసాదం అనే చెప్పాలి. ఉదయం పూట ఖర్జూరం తినడం శరీరానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. కానీ ఎండిన ఖర్జూరాలు మంచివా లేదా నీటిలో నానబెట్టిన ఖర్జూరాలు..

Soaked Vs Dry Dates: నానబెట్టినవా.. ఎండినవా.. ? ఖర్జూరాలు ఎలా తీసుకుంటే మంచిది..
Soaked Vs Dry Dates

Updated on: Sep 03, 2025 | 9:30 PM

ఖర్జూరాలు గొప్ప పోషక విలువలు కలిగిన అద్భుత పండు. ఎడారి దేశాలతోపాటు అనేక ప్రదేశాలలో ఖర్జూరాలకు విశిష్ట ఆదరణ ఉంది. సహజ తీపి కలిగిన ఈ పండు ప్రకృతి అందించిన ప్రసాదం అనే చెప్పాలి. ఉదయం పూట ఖర్జూరం తినడం శరీరానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. కానీ ఎండిన ఖర్జూరాలు మంచివా లేదా నీటిలో నానబెట్టిన ఖర్జూరాలు శరీరానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయా? అనే సందేహం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఏది మంచిదో ఇక్కడ తెలుసుకుందాం..

ఎండిన ఖర్జూరాల ప్రయోజనాలు

ఎండిన ఖర్జూరాలలో సహజ చక్కెర, అలాగే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
వీటిని తినడం వల్ల త్వరగా శక్తి లభిస్తుంది. అందువల్ల అలసట నుంచి వేగంగా ఉపశమనం పొందడానికి ఉపయోగపడుతుంది. శరీరం బలహీనంగా ఉన్నప్పుడు దీనిని తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో ఎండిన ఖర్జూరాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి.
ఎండిన ఖర్జూరంలో ఇనుము, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలపరుస్తుంది. రక్తహీనతను నివారిస్తుంది.
అయితే ఎండిన ఖర్జూరాలు గట్టిగా ఉంటాయి. తినడానికి కష్టంగా ఉంటాయి. ఎక్కువగా తినడం వల్ల గ్యాస్ లేదా మలబద్ధకం ప్రమాదం పెరుగుతుంది.

నానబెట్టిన ఖర్జూరాల ప్రయోజనాలు

  • ఎండిన ఖర్జూరాలను నీటిలో లేదా పాలలో కొన్ని గంటలు నానబెట్టినట్లయితే సులభంగా జీర్ణమవుతాయి.
  • నానబెట్టిన ఖర్జూరాలు కొంతవరకు సాధారణ స్థాయిలో సహజ చక్కెరను కలిగి ఉంటాయి. ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు సాపేక్షంగా సురక్షితమైనవి.
  • నానబెట్టిన ఖర్జూరాలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది.
  • ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన ఖర్జూర పండ్లను తినడం వల్ల శరీరం పోషకాలను వేగంగా గ్రహించడంలో సహాయపడుతుంది.
  • గుండెల్లో మంట, గ్యాస్, జీర్ణ సమస్యలు ఉన్నవారికి నానబెట్టిన ఖర్జూరాలు మరింత అనుకూలంగా ఉంటాయి.

ఇంతకీ ఏది మంచిది?

తక్షణ శక్తికి, శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలనుకునే వారికి ఎండిన ఖర్జూరాలు తినడం మంచిది. అవి సులభంగా జీర్ణం కావాలంటే నానబెట్టిన ఖర్జూరాలను ఎంచుకోవచ్చు. ఎండిన, నానబెట్టిన ఖర్జూరాలు రెండూ వేర్వేరు ప్రయోజనాలను కలిగి ఉంటాయి. నిర్దిష్టంగా శరీరానికి ఏది మంచిది అనేది చాలావరకు వయస్సు, శారీరక స్థితి, అవసరాలపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, శీతాకాలంలో జీర్ణ సమస్యల కోసం ఎండిన, నానబెట్టిన రెండు రకాల ఖర్జూరాలను అప్పుడప్పుడు తినడం మంచిది. అప్పుడే ఖర్జూరాల నిజమైన శక్తి లభిస్తుందని నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.