Post Lunch Sleep: అందుకే భోజనం చేసిన తర్వాత నిద్ర వస్తుందట..! బంగాళాదుంపలు, రొట్టె, అన్నం తింటే..

|

Oct 12, 2023 | 7:22 PM

భోజనం చేసిన తర్వాత నిద్రపోవడం సహజం. తిన్న తర్వాత ఎవరైనా నిద్రవస్తుంది. అందుకు కారణం.. మన శరీరంలో సిర్కాడియన్ రిథమ్ అని పిలువబడే సహజమైన జీవ గడియారం. ఇది మన నిద్ర-చక్రాన్ని నియంత్రిస్తుంది. సాధారణంగా మధ్యాహ్నం వేళ చురుకుదనం, శక్తి స్థాయి సహజంగా క్షీణిస్తుంది. ఇది మనల్ని నిద్రపోయేలా చేస్తుంది. ఇది సిర్కాడియన్ రిథమ్‌లో ఒక భాగం. అలాగే జీర్ణక్రియ కూడా మరొక కారణం. తిన్న తర్వాత, శరీరం రక్త ప్రవాహాన్ని జీర్ణవ్యవస్థకు మళ్లిస్తుంది. రక్తం ప్రవాహం ఇలా జీర్ణవ్యవస్థకు..

Post Lunch Sleep: అందుకే భోజనం చేసిన తర్వాత నిద్ర వస్తుందట..! బంగాళాదుంపలు, రొట్టె, అన్నం తింటే..
Post Lunch Sleep
Follow us on

మధ్యాహ్నం భోజనం తర్వాత చాలా మందికి నిద్రవస్తుంది. ఇలా తిన్న తర్వాత ఏదైనా పని చేయాలన్నా, చదువుకోవాలన్నా నిద్రను ఆపుకోవడానికి నానాపాట్లు పడుతుంటారు. అప్పుడు 10 నుంచి 15 నిమిషాల కునుకు తీస్తే చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. కానీ తిన్న తర్వాత ఎందుకు నిద్రవస్తుంది? ఈ సమస్యను పరిష్కరించవచ్చా? అనే ప్రశ్నలు మీకెప్పుడైనా తలెత్తాయా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

జీర్ణవ్యవస్థ

భోజనం చేసిన తర్వాత నిద్రపోవడం సహజం. తిన్న తర్వాత ఎవరైనా నిద్రవస్తుంది. అందుకు కారణం.. మన శరీరంలో సిర్కాడియన్ రిథమ్ అని పిలువబడే సహజమైన జీవ గడియారం. ఇది మన నిద్ర-చక్రాన్ని నియంత్రిస్తుంది. సాధారణంగా మధ్యాహ్నం వేళ చురుకుదనం, శక్తి స్థాయి సహజంగా క్షీణిస్తుంది. ఇది మనల్ని నిద్రపోయేలా చేస్తుంది. ఇది సిర్కాడియన్ రిథమ్‌లో ఒక భాగం. అలాగే జీర్ణక్రియ కూడా మరొక కారణం. తిన్న తర్వాత, శరీరం రక్త ప్రవాహాన్ని జీర్ణవ్యవస్థకు మళ్లిస్తుంది. రక్తం ప్రవాహం ఇలా జీర్ణవ్యవస్థకు మళ్లడం వల్ల మెదడుకు రక్త ప్రవాహం తగ్గుతుంది. ఫలితంగా శక్తి సన్నగిల్లి, మగతగా అనిపిస్తుంది. మనం తీసుకునే ఆహారం కూడా నిద్రను ప్రభావితం చేస్తుంది

ఆహార అలవాట్లు

బంగాళాదుంపలు, రొట్టె, బియ్యం, పాస్తా వంటి కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలు, చక్కెర అధికంగా ఉండే ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగడానికి కారణమవుతాయి. ఇలా రక్తంలో చక్కెర పెరగడం వల్ల శక్తి స్థాయిలు తగ్గుతాయి. ఇది అలసట భావనలకు దారి తీస్తుంది. ఘనాహారం తిన్నప్పుడు జీర్ణక్రియకు ఎక్కువ శక్తి అవసరమవుతుంది. దీనివల్ల తిన్న తర్వాత మత్తుగా అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

కొన్ని ఆహారాలు తినడం వల్ల ఇన్సులిన్, సెరోటోనిన్‌తో సహా వివిధ హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది మనుషుల మానసిక స్థితి, శక్తి స్థాయిని విపరీతంగా ప్రభావితం చేస్తుంది. సెరోటోనిన్‌ని ప్రోత్సహించే ఆహారాల్లో చీజ్, టోఫు, సాల్మన్ చేప, నట్స్ వంటివి ముఖ్యమైనది. ఈ ఆహారాలు సెరోటోనిన్‌ను ప్రోత్సహిస్తాయి. ముందు రోజు రాత్రి తగినంతగా నిద్రపోకపోకపోయినా పగటిపూట భోజనం తర్వాత నిద్ర వచ్చే అవకాశం ఉంది.

ఈ సమస్యను ఎలా నిరోధించాలంటే..

అస్సాంకు చెందిన MBBS వైద్యుడు డాక్టర్ శ్యామ్ శర్మ మాట్లాడుతూ.. ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు, శరీరంలోని 60-75 శాతం శక్తి జీర్ణవ్యవస్థని ప్రాసెస్ చేయడానికి ఖర్చు చేస్తుంది. ఇతర కార్యకలాపాల నుంచి శరీర శక్తి ఆహారం జీర్ణం చేయడానికి ఖర్చు అవుతుంది. ఈ శక్తి మళ్లింపు నిద్రమత్తుకు కారణమవుతుంది. కాబట్టి లంచ్ తర్వాత నిద్రపట్టకుండా ఉండాలంటే అతిగా తినకుండా మితంగా తినడం బెటర్‌ అంటున్నారు. శక్తిని పెంచే ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి. రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే నిర్జలీకరణం వల్ల తరచుగా అలసట భావన కలుగుతుంది. రక్త ప్రవాహాన్ని, చురుకుదనాన్ని ప్రేరేపించడానికి తిన్న తర్వాత కాసేపు వాకింగ్‌ చేయాలి. ఎక్కువగా కెఫీన్ తీసుకోవడం మానుకోవాలి. అధిక కెఫిన్ అలసిపోయేలా చేస్తుంది. ఫలితంగా నిద్రవస్తుంది. వీలైతే భోజనం చేసిన వెంటనే 15 నుంచి 20 నిమిషాల పాటు చిన్న కునుకు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా కాసేపు విశ్రాంతి ఇవ్వడం ద్వారా నిద్ర వల్ల సంభవించే మగతను తగ్గించడానికి సహాయపడుతుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.