కొందరికి నిద్రలో గురక పెట్టే అలవాటు ఉంటుంది. కొందరికి నిద్రలో నడిచే అలవాటు కూడా ఉంటుంది. ఇంకొందరికి నిద్రలో మాట్లాడే అలవాటు ఉంటుంది. మీకు కూడా నిద్రలో మాట్లాడే అలవాటు ఉంటే, దాని అర్థం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. చాలామంది ఈ విషయాన్ని ఫన్నీగా తీసుకుంటారు. ఎందుకంటే దీన్ని చిన్న విషయంగా తీసుకోవద్దని నిపుణుల చెబుతున్నారు. దీనికి ఏదో ఒక కారణం ఉంటుందని, అలాగే చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. నిద్రలో మాట్లాడేందుకు కారణం, చికిత్స విషయాలకు సంబంధించిన సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..
నిద్రలో మాట్లాడడాన్ని స్లీప్ టాకింగ్, సోమ్నిలోకీ అని కూడా అంటారు. స్లీప్ టాకింగ్ … నిద్రలో మాట్లాడడం. ఇది ఒక స్లీప్ డిసార్డర్ అంటున్నారు నిపుణులు. ఒక వ్యక్తి నిద్రలో తనకు తెలియకుండానే మాట్లాడుతూ ఉంటాడు. కొంతమంది స్పష్టంగా మాట్లాడితే మరి కొందరు గొణగుతూ ఉంటారు. ఇది స్వల్ప కాలం పాటు సాగుతుంది. అందరికీ ఈ అలవాటు ఉండదు. కొంతమందికే ఉంటుంది. వీరిలో వయస్సు, లింగంతో సంబంధం లేకుండా చాలా మందికి నిద్రలో మాట్లాడే అలవాటు ఉంటుంది. 3 నుంచి 10 సంవత్సరాల మధ్య పిల్లలు తరచుగా ఇలా ప్రవర్తిస్తుంటారు. వారిలో సగం మంది రాత్రి నిద్రలోనే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. నిద్రలో మాట్లాడటంలో కూడా జన్యుపరమైన అంశం అంటున్నారు నిపుణులు. కుటుంబంలో ఎవరికైనా నిద్రలో మాట్లాడే అలవాటు ఉంటే, అది తరువాతి తరం వారిపై కూడా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
నిద్రలో మాట్లాడటానికి కారణం ఏమిటి?:
నిద్రలో మాట్లాడటానికి ఖచ్చితమైన కారణం తెలియనప్పటికీ, ఇది నిద్ర ఏ దశలోనైనా సంభవించవచ్చు. ఇది కలతో ముడిపడి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. భావోద్వేగ ఒత్తిడి, కొన్ని మందులు, జ్వరం, మానసిక ఆరోగ్య రుగ్మతలు మరియు మాదకద్రవ్యాల దుర్వినియోగం వంటి అంశాలు నిద్రలో మాట్లాడటానికి కారణమవుతాయి. చాలా సందర్భాలలో, నిద్రలో మాట్లాడటానికి నిర్దిష్ట చికిత్స అవసరం లేదు. అయినప్పటికీ, నిద్రలో మాట్లాడటం ఇబ్బందిగా ఉంటే లేదా ఇతర నిద్ర రుగ్మతలు లేదా ఆరోగ్య సమస్యలు ఉంటే నిద్రకు సంబంధించిన వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిదని చెబుతున్నారు.
నిద్రలో మాట్లాడే అలవాటుకు ఖచ్చితమైన కారణం ఎంటీ..? అన్నది ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. దీనికి కలలు కనడంతో సంబంధం ఉండవచ్చని అంటున్నారు. భావోద్వేగాలు, ఒత్తిడి, కొన్ని రకాల మందులు వాడడం, జ్వరం, మానసిక ఆరోగ్య రుగ్మతలు వంటివి కారణాల వల్ల కూడా నిద్రలో మాట్లాడేందుకు దోహదం చేస్తాయని వివరిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..