AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చర్మ సంరక్షణలో కొత్త ట్రెండ్..! బ్యూటీ ప్రొడక్ట్స్‌, స్కిన్‌కేర్ రొటీన్‌లకు రెస్ట్ ఇచ్చేయండి

ప్రతి రోజు కొత్త కొత్త బ్యూటీ ప్రొడక్ట్స్‌, పొడవైన స్కిన్‌కేర్‌ రొటీన్‌ల మధ్య ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది. అదే స్కిన్‌ సైక్లింగ్‌. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ పద్ధతి, చర్మానికి విశ్రాంతి ఇస్తేనే మెరుగైన ఫలితాలు అందిస్తుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ ఉత్పత్తులు వాడటం కాకుండా, సరైన క్రమంలో వాడటమే ఈ ట్రెండ్‌ ప్రత్యేకత. స్కిన్‌కేర్‌ ప్రొడక్ట్స్‌ను ప్రతిరోజూ ఒకేలా కాకుండా, నాలుగు రోజుల సైకిల్‌లో మార్చుతూ ఉపయోగించడాన్ని స్కిన్‌ సైక్లింగ్‌ అంటారు. దీని వల్ల చర్మంపై ఒత్తిడి తగ్గి, మంట లేదా దురద వంటి సమస్యలు తగ్గుతాయి. రాత్రిపూట దీన్ని ప్రయత్నించడం వల్ల చర్మం వేగంగా కోలుకుంటుంది.

చర్మ సంరక్షణలో కొత్త ట్రెండ్..! బ్యూటీ ప్రొడక్ట్స్‌, స్కిన్‌కేర్ రొటీన్‌లకు రెస్ట్ ఇచ్చేయండి
Skin Cycling.jpg
Nikhil
|

Updated on: Jun 05, 2026 | 9:25 PM

Share

మొదటి రోజున ఎక్స్‌ఫోలియేషన్‌ చేయడం ద్వారా మృత చర్మాన్ని తొలగించాలి. ఇది చర్మ తత్వాన్ని బట్టి ఎంచుకునే తేలికపాటి ఎక్స్‌ఫోలియేటర్‌తో చేయాలి. రెండో రోజున రెటినాల్‌ ఆధారిత ఉత్పత్తులను వాడాలి. ఇవి చర్మ పునరుద్ధరణకు సాయపడటంతో పాటు కొలాజెన్‌ ఉత్పత్తిని పెంచుతాయి. మూడు, నాలుగు రోజులు రికవరీ డేస్‌గా పరిగణించాలి. ఈ సమయం చర్మానికి విశ్రాంతిని ఇవ్వడానికి ఉపయోగించాలి. మంచి మాయిశ్చరైజర్‌, హైడ్రేటింగ్‌ ఉత్పత్తులతో చర్మాన్ని తేమగా ఉంచాలి. తద్వారా చర్మం ఆరోగ్యంగా కోలుకునే అవకాశం ఉంటుంది.

ఎందుకు ప్రాచుర్యం..

ఈ విధానం వల్ల ఓవర్‌ స్కిన్‌కేర్‌ సమస్య తగ్గుతుంది. ముఖ్యంగా సున్నితమైన చర్మ తత్వం ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా మారుతుంది. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంతో చర్మాన్ని సంరక్షించుకోవచ్చనే కారణంతో నేటి తరం దీనిని ఎక్కువగా అనుసరిస్తున్నారు. ఒకే రకమైన రసాయనాలను రోజూ వాడటం వల్ల చర్మంపై పడే దుష్ప్రభావాలను ఈ సైక్లింగ్ పద్ధతి అడ్డుకుంటుంది. క్రమం తప్పకుండా పాటిస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. అయితే, ఏదైనా కొత్త ఉత్పత్తులను వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం చాలా మంచిది.

చర్మ ఆరోగ్యం కోసం కేవలం ఉత్పత్తుల మీదనే ఆధారపడకుండా, సరైన పద్ధతిని ఎంచుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చు. చర్మ సంరక్షణ అనేది ఒక నిరంతర ప్రక్రియ. స్కిన్ సైక్లింగ్ అనేది చర్మానికి తగినంత సమయం ఇవ్వడం ద్వారా సహజసిద్ధమైన మెరుపును తిరిగి తీసుకొస్తుంది. మీ జీవనశైలిలో చిన్న మార్పులు చేయడం ద్వారా చర్మంపై కనిపించే అలసటను తొలగించవచ్చు. నేటి కాలంలో అందం కంటే ఆరోగ్యం ముఖ్యమని భావించే వారికి ఈ పద్ధతి సరైన ఎంపిక. నిపుణుల సలహాతో ఈ సైకిల్‌ను మీ దినచర్యలో భాగం చేసుకోండి.

Follow Us