Skin Care Tips: ముఖం నిగారింపు కోసం సహజసిద్దమైన 5 పద్దతులు.. ఏంటో తెలుసుకోండి..

|

Dec 14, 2021 | 3:04 PM

Skin Care Tips: కాలుష్యం, ఒత్తిడి కారణంగా ముఖంపై గ్లో కూడా తగ్గుతుంది. గ్లోయింగ్ స్కిన్ కోసం మార్కెట్‌లో చాలా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.

Skin Care Tips: ముఖం నిగారింపు కోసం సహజసిద్దమైన 5 పద్దతులు.. ఏంటో తెలుసుకోండి..
Skin Care
Follow us on

Skin Care Tips: కాలుష్యం, ఒత్తిడి కారణంగా ముఖంపై గ్లో కూడా తగ్గుతుంది. గ్లోయింగ్ స్కిన్ కోసం మార్కెట్‌లో చాలా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి ప్రభావం చాలా తక్కువ సమయం వరకే ఉంటుంది. అందుకే మెరిసే చర్మాన్ని పొందడానికి కొన్ని సులభమైన చిట్కాలను అనుసరించవచ్చు. ఇది మీ చర్మం మెరుపును కోల్పోకుండా సహాయపడుతుంది.

1. నీరు తాగాలి
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చర్మం మృదువుగా, మెరుస్తూ ఉండటానికి తోడ్పడుతుంది.

2. ధ్యానం, యోగాసనాలు
ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా శారీరక ఆరోగ్య సమస్యలను కూడా తీవ్రతరం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేయాలి. ఇది మానసిక సమస్యలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు కంటినిండా నిద్ర పోవాలి.

3. ఫేషియల్ తప్పనిసరి
చర్మం మెరుస్తూ ఉండాలంటే రెగ్యులర్ స్కిన్ కేర్ చాలా ముఖ్యం. మీ చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఫేషియల్స్, క్లీనప్‌లు చాలా అవసరం. శనగ పిండి, పసుపు, పెరుగు, తేనె వంటి సింపుల్ హోం రెమెడీస్‌ పాటించి చర్మాన్ని మృదువుగా మార్చుకోవచ్చు.

4. ఆరోగ్యకరమైన ఆహారం
ఆరోగ్యకరమైన చర్మం కోసం పోషకాలు ఉండే ఆహారాలను తినాలి. ఎక్కువగా ఆహారంలో అనేక రకాల కూరగాయలు, పండ్లను చేర్చాలి. ప్రతిరోజు పాలు తాగాలి.

5. టోనింగ్
మీ చర్మాన్ని శుభ్రపరిచిన తర్వాత ముఖంపై హైడ్రేషన్ ప్యాక్‌ని అప్లై చేయాలి. రోజ్ వాటర్ ఉపయోగించడం మంచిది. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అలాగే యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. రోజ్ వాటర్‌ను మీ ముఖంపై రోజుకు చాలాసార్లు ఉపయోగించవచ్చు.

నిశ్చితార్థం తర్వాత అమ్మాయి, అబ్బాయి ఈ 4 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి.. లేదంటే..?

UGC: యూనివర్సిటీ, కాలేజీలలో ఆఫ్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తారా..! యూజీసీ ఏం చెబుతోంది..?

వామ్మో ఇదేం పిచ్చి..! ‘మంత్రగత్తె’గా మారిన 27 ఏళ్ల యువతి.. ఎందుకో తెలుసా..?