Telugu News Lifestyle Simple, Science Backed Tips from a Chennai Health Coach to Drop Kilos Before New Year — Without Cutting Carbs!
Weight Loss: బరువు తగ్గేందుకు ఈ 4 టిప్స్ పాటించండి.. రిజల్ట్ చూస్తే షాకవుతారు!
అధిక బరువు సమస్యతో బాధపడుతున్న చాలామంది ‘ఈరోజు నుంచే డైట్ స్టార్ట్ చేయాలి’ అనుకుంటారు. పండుగలు, పార్టీలు, డెడ్‌లైన్‌ల మధ్య బరువు తగ్గించుకోవడం అసాధ్యం. కొత్త సంవత్సరం వస్తుందనగానే రెజల్యూషన్స్‌లో తప్పకుండా ఉండేవాటిలో బరువు తగ్గడం ఒకటి. ఈ రోజుల్లో అధిక బరువు కేవలం పైకి ..
అధిక బరువు సమస్యతో బాధపడుతున్న చాలామంది ‘ఈరోజు నుంచే డైట్ స్టార్ట్ చేయాలి’ అనుకుంటారు. పండుగలు, పార్టీలు, డెడ్‌లైన్‌ల మధ్య బరువు తగ్గించుకోవడం అసాధ్యం. కొత్త సంవత్సరం వస్తుందనగానే రెజల్యూషన్స్‌లో తప్పకుండా ఉండేవాటిలో బరువు తగ్గడం ఒకటి. ఈ రోజుల్లో అధిక బరువు కేవలం పైకి కనిపించే సమస్య మాత్రమే కాదు,అది నీరసం, డయాబెటిస్, గుండె జబ్బులు, కీళ్లనొప్పులు, నిద్రలేమి వంటి రోగాలకు ఓపెన్ ఇన్విటేషన్! ఒకప్పుడు ‘కొంచెం బొద్దుగా ఉంటే బాగుంటుంది’ అనేవారు… కానీ ఇప్పుడు BMI 25 పైన ఉంటేనే డాక్టర్లు రెడ్ అలర్ట్ ఇస్తున్నారు.
పండుగల సీజన్‌లో మిఠాయి, ఫ్రైస్, లేట్ నైట్ పార్టీలతో కిలోలు పెరగడం సహజం,. కానీ ఆ ఎక్స్‌ట్రా ఫ్యాట్ శరీరంలో చేరి, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అధిక బరువును సులభంగా, సస్టైనబుల్‌గా తగ్గించుకోవచ్చు. సస్టైనబుల్‌గా బరువు తగ్గించుకోవడానికి చెన్నైకి చెందిన సర్టిఫైడ్ హెల్త్ కోచ్ వివేక్ తిరువేంగడం చెబుతున్న సింపుల్ టిప్స్ ఏంటో చూద్దాం..
చాలామంది బరువు తగ్గేందుకు ‘కార్బ్స్ తగ్గించాలి’ అని అనుకుంటారు, కానీ వాస్తవానికి మీల్స్‌లో ఫ్యాట్‌ను మాత్రమే రెడ్యూస్ చేయాలి. ఫ్యాట్ క్యాలరీలు ఎక్కువగా ఇస్తుంది. ముఖ్యంగా రాత్రి డిన్నర్‌లో ఆయిల్‌ను పూర్తిగా అవాయిడ్ చేయాలి. ‘చాలామంది కార్బ్స్ తగ్గించాలని అనుకుంటారు. కానీ నిజానికి మీరు మొదట ఫ్యాట్‌ను కట్ చేయాలి’ అంటున్నారు వివేక్. వంట చేసేటప్పుడు అధిక నూనె ఉపయోగించకుండా ఆయిల్ స్ప్రే ఉపయోగించాలి. కూరగాయలు ఉడికించి తీసుకోవాలి. ఆలుగడ్డ, బెండకాయ, దొండకాయ వంటి కూరగాయలను ఫ్రై చేయకుండా కూర వండుకుని తినాలి.
కాఫీ, టీలు లాంటివి హిడెన్ క్యాలరీలను పెంచుతాయి. స్వీట్ డ్రింక్స్‌కు బదులు వాటర్, గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ తాగాలి. ఫ్రూట్ జ్యూస్‌లో చక్కెర వాడకూడదు. ఇలా చేయడం వల్ల రోజువారీ క్యాలరీలు ఆటోమాటిక్‌గా 200-300 తగ్గుతాయి.
కష్టమైన వ్యాయామం చేయాలి అని ఇబ్బందికరమైన ఎక్సర్‌సైజ్ చేయాలని అనుకోకుండా, సింపుల్‌గా బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ తర్వాత 10 నిమిషాలు వాక్ చేయాలి. ఇంటి చుట్టూ లేదా బాల్కనీలో నడవాలి.
ప్రతిరోజూ ఒకే హై-ప్రోటీన్, హై-ఫైబర్ బ్రేక్‌ఫాస్ట్ తినాలి. ఇలా తినడం వల్ల కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన వస్తుంది, క్రేవింగ్స్ తగ్గిస్తుంది, క్యాలరీలు ఆటోమాటిక్‌గా డౌన్ అవుతాయి. ఓట్స్ విత్ ఫ్రూట్స్ & నట్స్, ఎగ్స్ విత్ వెజిటబుల్స్ లేదా గ్రీక్ యోగర్ట్ వంటివాటిని తీసుకోవాలి. వీటి వల్ల రోజంతా ఎనర్జీ స్థిరంగా ఉంటుంది, స్నాకింగ్ తగ్గుతుంది.NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే జారీ చేయబడినవి.. వీటిని మేం ధృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.