frozen Green Peas: ఫ్రీజ్ చేసిన బఠానీలను ఎక్కువగా తింటున్నారా..! ఈ ఆరోగ్య సమస్యలకు వెల్కమ్ చెబుతున్నట్లే..

|

Jul 17, 2024 | 11:24 AM

శీతాకాలం మినహా మిగిలిన సీజన్లలో పచ్చి బఠానీలు అందుబాటులో ఉండవు. దీంతో ప్రీజ్ చేసిన బఠానీలను ఉపయోగిస్తారు. వేసవి లేదా వర్షాకాలంలో కూడా కొంతమంది బఠానీలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇలా స్తంభింపచేసిన బఠానీలు అనేక సమస్యలను కలిగిస్తాయి. ఎవరైనా సరే కూరల తయారీలో లేదా పులావ్ లేదా ఇతర రుచికరమైన ఆహార పదార్ధాల తయారీలో ఇలా స్తంభింపచేసిన బఠానీలను ఉపయోగిస్తే.. వాటి వలన కలిగే ఆనారోగ్యం గురించి తెలుసుకోవాలి.

frozen Green Peas: ఫ్రీజ్ చేసిన బఠానీలను ఎక్కువగా తింటున్నారా..! ఈ ఆరోగ్య సమస్యలకు వెల్కమ్ చెబుతున్నట్లే..
Frozen Green Peas
Follow us on

కొన్ని రకాల పండ్లు, కూరగాయలు సీజన్ ప్రకారం తింటే.. మరికొన్నిటిని సీజన్ కు సంబంధం లేకుండా ప్రతి సీజన్‌లోనూ తింటారు. అలాంటి ఆహారంలో బఠానీలు ఒకటి. బఠానీలతో చేసిన వంటకాలను ఏ కాలంలోనైనా ఆస్వాదిస్తారు. అయితే పచ్చి బఠానీలు మాత్రం శీతాకాలంలోనే అందుబాటులో ఉంటాయి, మిగిలిన రోజుల్లో ఫ్రీజ్ చేసిన బఠానీలను ఆహార తయారీలో ఉపయోగిస్తారు. వీటి రుచికూడా పచ్చి బఠానీల మాదిరిగానే ఉంటుంది. అయితే ఇవి మాత్రం పచ్చి బఠానీల వలె ఆరోగ్యానికి మేలు చేసేవి కావని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. శీతాకాలం మినహా మిగిలిన సీజన్లలో పచ్చి బఠానీలు అందుబాటులో ఉండవు. దీంతో ప్రీజ్ చేసిన బఠానీలను ఉపయోగిస్తారు. వేసవి లేదా వర్షాకాలంలో కూడా కొంతమంది బఠానీలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇలా స్తంభింపచేసిన బఠానీలు అనేక సమస్యలను కలిగిస్తాయి. ఎవరైనా సరే కూరల తయారీలో లేదా పులావ్ లేదా ఇతర రుచికరమైన ఆహార పదార్ధాల తయారీలో ఇలా స్తంభింపచేసిన బఠానీలను ఉపయోగిస్తే.. వాటి వలన కలిగే ఆనారోగ్యం గురించి తెలుసుకోవాలి. స్తంభింపచేసిన బఠానీలతో చేసిన వంటకాలు రుచికరంగా ఉంటాయి. అయితే అదే సమయంలో అవి ఆరోగ్యానికి చాలా హానిని కలిగిస్తాయి. ముఖ్యంగా ప్రతిరోజూ తినే ఆహారంలో వీటిని చేర్చుకోవడం మానుకోవాలి. ఈ రోజు రోజూ స్తంభింపచేసిన బఠానీలు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలను గురించి తెలుసుకుందాం..

స్తంభింపచేసిన బఠానీలు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటంటే?

బరువు పెరుగుతారు: స్తంభింపచేసిన బఠానీలు తినడం వల్ల బరువు అకస్మాత్తుగా పెరుగుతుందని చాలా మందికి తెలియదు. ఎందుకంటే బఠాణీలు ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి, స్టార్చ్ ఉపయోగించబడుతుంది. ఇది శరీరంలో కొవ్వును సులభంగా పెంచుతుంది. అందువల్ల ఎవరైనా బరువు తగ్గాలనుకుంటే తినే ఆహారంలో స్తంభింపచేసిన బఠానీలను చేర్చుకోవడం మానెయ్యాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పోషకాహార లోపాలు: పచ్చి బఠానీలతో పోలిస్తే ఘనీభవించిన బఠానీలలో పోషకాలు తక్కువగా ఉంటాయి. అదే సమయంలో రిఫ్రిజిరేటర్‌లో ఎక్కువ కాలం నిల్వ చేయడం వల్ల వీటిల్లో మిగిలిన పోషకాలు కూడా నాశనం అవుతాయి. అందువల్ల ఏదైనా ఆహారం తయారు చేయడానికి ఎల్లప్పుడూ తాజా బఠానీలను మాత్రమే ఉపయోగించాలి.

మధుమేహం, బీపీ రోగులకు హానికరం: ఘనీభవించిన బఠానీలలో పిండి పదార్ధం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. అందువల్ల డయాబెటిక్ రోగులు తినే ఆహారం నుండి స్తంభింపచేసిన బఠానీలను మినహాయించాలి. అదే సమయంలో ఘనీభవించిన బఠానీలు తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. కనుక ఈ సమస్యను నివారించడానికి స్తంభింపచేసిన బఠానీలను తినకూడదు.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏ రకమైన విత్తనాలనైనా ఉపయోగించే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)