Saraswati Leaf
Saraswathi plant benefits: బ్రహ్మి మొక్క గురించి మీకు తెలుసా..? ఆయుర్వేదంలో ఈ మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిని వాడుక భాషలో సరస్వతి మొక్క అని కూడా అంటారు. పిల్లల్లో తెలివి తేటలు, జ్ఞాపక శక్తి పెరగాలన్నా పెద్దలు బ్రహ్మి ఆకు తినాలని చెబుతూ ఉండేవారు. రోజూ నాలుగు బ్రహ్మి ఆకులను నమిలి తింటే మెదడు పనితీరు మెరుగవుతుందని చెబుతూ ఉంటారు. ప్రస్తుతం అన్ని ఆయుర్వేద షాపుల్లో ఇది పొడి, టాబ్లెట్స్, లేహ్యం, తైలం.. ఇలా అనేక రూపాల్లో లభిస్తుంది. ఈ మొక్కలను ఇంట్లోనే హాయిగా పెంచుకోవచ్చు. ఈ మొక్కకు సంబంధించిన మరిన్ని ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
- మతిమరపు లక్షణాలను తగ్గించడానికి బ్రహ్మి మొక్క దివ్య ఔషధం
- ఇది తెలివితేటలు, ఏకాగ్రత , జ్ఞాపకశక్తికి కారణమయ్యే మెదడులోని హిప్పోకాంపస్ భాగంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది
- పచ్చ కామెర్లతో బాధపడుతున్న వారికి ఈ మొక్క ఆకుల రసాన్ని తాగిస్తే మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు
- షుగర్ వ్యాధి గ్రస్థులకు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది.
- ఈ ఆకుల రసం తాగడం వల్ల రక్తం కూడా శుభ్ర పడుతుందని, రక్త హీనత సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని చెబుతారు
- జుట్టు రాలడాన్ని అరికట్టి ఒత్తుగా ఆరోగ్యంగా పెరగడానికి సహాయ పడుతుంది.
- సరస్వతి తైలం చర్మ కణాల పునరుత్పత్తిని ప్రేరేపించడం ద్వారా చర్మం రంగును పెంచుతాయి.
- కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నవారు ఈ ఆకుల రసంలో కాస్త వామును కలిపి మెత్తని పేస్టులా చేసుకుని తినడం వల్ల..చెడు కొవ్వు కరిగిపోతుందట
- గ్యాస్ట్రిక్ అల్సర్లను తగ్గించడానికి, ప్రేగు సిండ్రోమ్ చికిత్సకు అత్యంత ఉపయోగపడే ఔషధం బ్రహ్మి ఆకు
- ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు ఈ మొక్క ఆకుల్లో నిక్షిప్తమై ఉన్నాయి
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇలాంటి పద్ధతులు/ఆహారం/చిట్కాలు పాటించే ముందు దయచేసి వైద్య సలహా తీసుకోవడం మంచింది.
Also Read: కళ్లు చెదిరే ఆఫర్ ప్రకటించిన తెలంగాణ పోలీస్ శాఖ.. పెండింగ్ చలాన్లు ఉన్నవారికి గుడ్ న్యూస్’
అన్నం పాత్రలో ఉడికించితే మంచిదా..? ప్రెజర్ కుక్కర్‌లో వండితే మంచిదా?