Rose Benefits For Hair: పట్టులాంటి జుట్టు కోసం గులాబీ రేకుల హెయిర్ మాస్క్ ..!! ఇలా వాడితే..

మెరిసే, అందమైన చర్మం కోసం గులాబీలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. రోజ్‌ వాటర్‌, గులాబీతో ఫేస్‌ప్యాక్‌ ఇలా రకరకాలుగా గులాబీలను చర్మ సౌందర్య సాధానాలుగా ఉపయోగిస్తుంటారు. అయితే గులాబీ జుట్టుకు కూడా ఉపయోగిస్తారని మీకు తెలుసా..? గులాబీ పూలు ఆరోగ్యంతో పాటు అందానికి, ఆకర్షణీయమైన, బలమైన పట్టులాంటి జుట్టు కోసం కూడా ఉపయోగించవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

Rose Benefits For Hair: పట్టులాంటి జుట్టు కోసం గులాబీ రేకుల హెయిర్ మాస్క్ ..!! ఇలా వాడితే..
Rose Benefits For Hair

Updated on: Apr 12, 2025 | 2:13 PM

ప్రేమకు గుర్తుగా ఇచ్చే గులాబీలను మీరు స్కిన్, హెయిర్ కేర్​ కోసం ఉపయోగించవచ్చు. గులాబీలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో ఐరన్, విటమిన్ సి, ఎ, సోడియం, కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు లభిస్తాయి. స్కాల్ప్‌లో దురద, మంట, దద్దుర్లు నుండి రక్షిస్తాయి. గులాబీ రేకులను మీ జుట్టుకు అప్లై చేయడం వల్ల మీ స్కాల్ప్ చాలా కాలం పాటు హైడ్రేట్ గా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి.

గులాబీలోని న్యూటియెంట్ర్స్ సౌందర్య రక్షణలో ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. రోజ్ వాటర్​ లేదా రోజ్ ఆయిల్ సహజమైన మాయిశ్చరైజర్స్​గా పని చేస్తాయి. జుట్టు పెరుగుదల కోసం గులాబీ రేకులను ఉపయోగించేందుకుగానూ ముందుగా కొన్ని గులాబీ రేకులను తక్కువ మంటపై ఉడికించుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని మెత్తటి పేస్ట్‌లా చేసుకుని తలకు చక్కటి ప్యాక్‌లా వేసుకోవాలి. అది చల్లారిన తర్వాత దానితో తలకు మసాజ్ చేయాలి.

గులాబీ రేకుల హెయిర్ మాస్క్‌ కోసం దానిని రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌లో కలబంద జెల్, పెరుగు కలుపుకోవాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు జుట్టుకు అప్లై చేయండి. రోజ్‌మెరీ హెయిర్ ఆయిల్‌లో గులాబీ రేకులను వేసి అప్లై చేస్తే కూడ చక్కటి ఫలితం ఉంటుంది. జుట్టు తెల్లబడటం, ఫైన్ లైన్స్ వంటి సమస్యలను దూరం చేస్తాయి. pH స్థాయిలను లెవెల్ చేసి పింపుల్స్​ని దూరం చేస్తాయి. రోజ్ ఆయిల్​తో తలలో మసాజ్ చేస్తే రక్తప్రసరణ మెరుగవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇందుకోసం మీరు గులాబీ రేకులను మెత్తని పేస్ట్‌లా చేసుకుని ఆయిల్‌ కలిపి జుట్టుకు అప్లై చేసుకుంటే సరిపోతుంది. గులాబీ రేకులతో హెయిర్ స్ప్రేని కూడా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం కొన్ని గులాబీ రేకులను రెండు గ్లాసుల నీటిలో వేసి మరిగించుకుని చల్లార్చి స్ప్రే బాటిల్‌లో నిల్వ చేసుకుని వాడొచ్చు. అంతేకాదు..దీనిలోని విటమిన్ సి వృద్ధాప్య ఛాయలు రాకుండా స్కిన్​ని రక్షిస్తాయి.

కొబ్బరి నూనెలో గులాబీ రేకులను కలిపి వేడి చేసి, చల్లరిన తరువాత తలకు రాసుకోవటం వల్ల మెదడు చల్లబడి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. గులాబీ రేకుల సువాసన ఒత్తిడిని తగ్గిస్తుంది. గులాబీ రేకుల‌తో త‌యారు చేసిన డ్రింక్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి, ఒత్తిడి, డిప్రెష‌న్ వంటి స‌మ‌స్యలు దూరం అవుతాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..