
సౌదీ అరేబియా అంతటా కనిపించే సుగంధ ద్రవ్యాల మూలిక అయిన రెసెడా ఆల్బా, ఎడారీకరణను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సుగంధ మూలిక ఉత్తర సరిహద్దులలోని స్థానిక వృక్షసంపదలో కీలకమైన భాగం. తెల్ల మిగ్నోనెట్ లేదా తెల్లని నిటారుగా ఉండే మిగ్నోనెట్ అని కూడా పిలుస్తారు. ఈ మొక్క చిన్న, తెల్లని, సువాసనగల పువ్వులను కలిగి ఉంటుంది. ఈ మొక్కను అలంకార మొక్కగా కూడా పండిస్తారు. ఇది వసంతకాలంలో వికసిస్తుంది. తేనెటీగలు, ఇతర పరాగ సంపర్కాలను ఆకర్షిస్తుంది. పర్యావరణ సమతుల్యతను పెంచుతుంది. జీవవైవిధ్యానికి మద్దతు ఇస్తుంది. ఈ మొక్క అందానికి మాత్రమే కాదు అనేక ఔషధ గుణాలతో పాటు అనేక ఇతర ప్రయోజనాలను కూడా కలిగి ఉన్నాయి.
ఇసుక, బంకమట్టి నేలలు రెండింటిలోనూ పెరిగే ఈ మొక్క ఉత్తర సరిహద్దు ప్రాంతంలోని ఎడారి వాతావరణానికి బాగా సరిపోతుంది. నేలను స్థిరీకరించడం ద్వారా ఎడారీకరణను ఎదుర్కోవడంలో కూడా ఈ మొక్క కీలక పాత్ర పోషిస్తుంది.
సుమారు ఒక మీటరు ఎత్తు వరకు పెరిగే ఈ మొక్క యూరప్, ఆసియా, ఉత్తర ఆఫ్రికాకు కూడా చెందింది. దీనిని ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో పరిచయం చేయబడిన జాతిగా చూడవచ్చని పర్యావరణ పరిశోధకులు చెబుతున్నారు. రెసెడా ఆల్బా ఎడారిలో నీటి ఎద్దడిని తట్టుకుని పెరుగుతుందని.. ఈ మొక్క పెరుగుదల సౌదీ అరేబియాలో పర్యావరణాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అమన్ ఎన్విరాన్‌మెంటల్ అసోసియేషన్ చైర్మన్ నాసర్ అల్-ముజ్లాద్ అన్నారు. ఈ మొక్క అందం, ఆకర్షణ ఈ ప్రాంతం పర్యాటక, పర్యావరణ ప్రాముఖ్యతకు గణనీయమైన విలువను జోడించిందని ఆయన చెప్పారు. గతంలో అంతరించిపోయే ప్రమాదం ఉన్న ఈ మొక్కలు తిరిగి జీవం పోసుకున్నాయని.. ఇక నైనా వీటిని రక్షిచడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..