White Hair: ఈ మధ్యకాలంలో మనలో చాలా మందికి తెల్లజుట్టు, చుండ్రు వంటి కేశ సమస్యలు పెద్ద తల నొప్పిగా మారాయి. ముఖ్యంగా తెల్లజుట్టు వచ్చిందంటే చాలు, వృద్ధాప్య చాయలు అలముకున్నట్లే. అయితే తెల్లజుట్టు రావడానికి పోషకాహార లోపం, గాలి కాలుష్యం వంటి అనేక విషయాలు ప్రభావితం చేయవచ్చు. ఈ కారణాలతోనే కొంత మంది చిన్న వయసు నుంచే ఈ తెల్లజుట్టుతో బాధపడుతున్నారు. అసలు ఈ సమస్యకు కారణం, దీనికి పరిష్కారం ఏమిటో కనుగొనే ప్రయత్నంలో భాగంగా న్యూయార్క్ వర్సిటీ శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేశారు. మెలనిన్‌ని ఉత్పత్తి చేసే మూలకణాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల జుట్టు తెల్లబతుందని కొన్ని అధ్యయనాలు చెప్పగా.. ప్రోటీన్ లోపం, ఐరన్ లోపం వల్ల కూడా ఇలా జరుగుతుందని మరికొన్ని పరిశోధనల్లో తేలింది.
అయితే హెయిర్ ఫోలికల్స్‌లోని గ్రోత్ కంపార్ట్‌మెంట్ల మధ్య కదిలే స్టెమ్ సెల్స్‌పై ఈ ప్రక్రియ ఆధారపడుతుందని నూతన అధ్యయనాలు వివరిస్తున్నాయి. హెయిర్ గ్రోత్‌కి కారణమైన కొన్ని రకాల కణాలు కదిలే సామర్థ్యాన్ని కోల్పోవడం మూలంగా గ్రే హెయిర్ వస్తుందని వాటి సారాంశం. ఇందుకోసం వారు ఎలుకలపై చేసిన కొత్త అధ్యయనం జుట్టు నెరిసిపోవడానికి సంబంధించిన సమస్యలను వెల్లడించింది. మెలనోసైట్ స్టెమ్ సెల్స్ లేదా McSC అనే కణాలు ఇందుకు కారణమవుతాయంట.
మరోవైపు కొత్తగా కనుగొన్న మెకానిజమ్ మెలనోసైట్ స్టెమ్ సెల్స్ ఫిక్స్‌డ్ పొజిషన్స్‌ను అలాగే ఉండేలా చేస్తుందని.. అభివృద్ధి చెందుతున్న హెయిర్ ఫోలికల్ కంపార్ట్‌మెంట్‌ల మధ్య నిలిచిపోయిన కణాలు మళ్లీ కదలడానికి సహాయపడటం ద్వారా జుట్టు నెరసిపోవడాన్ని నిరోధిస్తుందన్నారు. ఇలా జరగడం వల్ల అతి త్వరలోనే గ్రే హెయిర్ రివర్స్ అయ్యే చాన్స్ ఉందన్నారు.