చెడు కొలెస్ట్రాల్‌కు మడతపెట్టే పవర్‌ఫుల్ పొడి.. ఉదయాన్నే నీటిలో కలిపి తాగారంటే దెబ్బకు మటాష్..

ఉరుకులు పరుగుల నేటి ప్రపంచంలో చాలా మంది జంక్, ప్రాసెస్డ్, ఆయిల్ ఫుడ్‌లను అధికంగా తీసుకుంటున్నారు. నూనె, జంక్ ఫుడ్‌లు రుచికరంగా ఉండవచ్చు.. కానీ అవి రక్త నాళాలలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.. ఇది గుండెపోటు - స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. అనారోగ్యకరమైన ఆహారం, వ్యాయామం లేకపోవడం వల్ల చిన్న వయస్సులోనే కొలెస్ట్రాల్ సమస్యలకు దారితీస్తుంది.

చెడు కొలెస్ట్రాల్‌కు మడతపెట్టే పవర్‌ఫుల్ పొడి.. ఉదయాన్నే నీటిలో కలిపి తాగారంటే దెబ్బకు మటాష్..
Cholesterol

Updated on: Nov 30, 2025 | 2:22 PM

ఉరుకులు పరుగుల నేటి ప్రపంచంలో చాలా మంది జంక్, ప్రాసెస్డ్, ఆయిల్ ఫుడ్‌లను అధికంగా తీసుకుంటున్నారు. నూనె, జంక్ ఫుడ్‌లు రుచికరంగా ఉండవచ్చు.. కానీ అవి రక్త నాళాలలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.. ఇది గుండెపోటు – స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. అనారోగ్యకరమైన ఆహారం, వ్యాయామం లేకపోవడం వల్ల చిన్న వయస్సులోనే కొలెస్ట్రాల్ సమస్యలకు దారితీస్తుంది. ఇది ఊబకాయంతోపాటు.. ఎన్నో జబ్బులకు ప్రదాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొలెస్ట్రాల్ ను తగ్గిచేందుకు చర్యలు తీసుకోవాలి.. అయితే.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి మీరు ఈ పొడిని తిసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి సోంపు, మెంతులు, ధనియాలు, జీలకర్ర పొడి..

కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఉదయం ఖాళీ కడుపుతో సోంపు, ధనియాలు, మెంతులు, జీలకర్ర పొడి కలిపిన నీటిని తాగవచ్చు. ఆయుర్వేదం ప్రకారం, ఈ పొడులు కొలెస్ట్రాల్ తగ్గించడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంతేకాకుండా

పొడిని ఎలా తయారు చేయాలి:

ఒక పాన్ తీసుకొని దానిలో 2 చెంచాల చొప్పున మెంతులు, సోంపు గింజలు, జీలకర్ర, కొత్తిమీర గింజలు వేయండి.

ఇప్పుడు దానిలో ఒక ముక్క దాల్చిన చెక్క కూడా వేయండి.

వీటన్నింటిని బాగా వేయించాలి.

అవి చల్లబడిన తర్వాత, అన్ని గింజలను గ్రైండ్ చేసి.. మంచిగా పొడి చేయండి.

ఇప్పుడు ఈ పొడిని ఒక కంటైనర్‌లో ఉంచండి..

దీని తర్వాత, ప్రతి ఉదయం ఈ పొడిని వేడి నీటిలో లేదా గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోండి..

చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి:

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. అనారోగ్యకరమైన ఆహారం వల్ల కొలెస్ట్రాల్ సమస్య పెరుగుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, అధిక ఫైబర్ తినండి. అదే సమయంలో, జిడ్డుగల నూనె పదార్థాలను తినడం మానుకోండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..