AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ అలర్ట్.. చిన్న పిల్లల్లో కూడా డయాబెటీస్ వీడియో

బిగ్ అలర్ట్.. చిన్న పిల్లల్లో కూడా డయాబెటీస్ వీడియో

Samatha J
|

Updated on: Nov 30, 2025 | 1:16 PM

Share

గతంలో 40 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వస్తుందనుకున్న డయాబెటిస్ ఇప్పుడు చిన్నారులను వణికిస్తోంది. షాకింగ్ ఏంటంటే.. కేవలం 8, 9, 10 ఏళ్ల పిల్లల్లోనూ ఊబకాయం, ప్రీడయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ లక్షణాలు బయటపడటం. మారిన మన జీవనశైలి, ఫుడ్ అలవాట్లు, ఎక్కువ స్క్రీన్ సమయం, మన జన్యువులే ఈ పెను మార్పుకు కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నేటి పిల్లలు ఎక్కువగా ప్యాక్ చేసిన స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్, చక్కెర కలిపిన డ్రింక్స్ తీసుకుంటున్నారు. వీటిలో పోషకాలు తక్కువ, కేలరీలు ఎక్కువ. ఇలాంటి ఆహారం శరీరంలో చక్కెరను నియంత్రించే ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా పనిచేయకుండా చేస్తుంది.గత దశాబ్ద కాలంలో పిల్లల జీవన విధానం మారింది. తక్కువ శారీరక శ్రమ, అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగం పెరగడం, ఎక్కువ స్క్రీన్ సమయం ఇవన్నీ కలిసి ఈ ఊబకాయానికి కారణమవుతున్నాయి. వీడియో గేమ్‌లు, ఆన్‌లైన్ క్లాసులు, రీల్స్ కోసం ఎక్కువ సమయం కేటాయించడం వల్ల ఆరుబయట ఆడుకునే సమయం పూర్తిగా తగ్గింది. శారీరక శ్రమ తగ్గితే, జీవక్రియ దెబ్బతిని, బరువు త్వరగా పెరుగుతారు. పిల్లలకు నిద్ర చాలా అవసరం. రాత్రిళ్లు ఆలస్యంగా పడుకోవడం లేదా నిద్ర పట్టకపోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది పొట్ట చుట్టూ కొవ్వును పెంచి, చిన్న వయసులోనే షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

మరిన్ని వీడియోల కోసం :

ఒక్క ఫ్లాప్ తో తిరగబడ్డ లోకేష్ కెరీర్ వీడియో

వారణాసి మేకింగ్ విషయంలో జక్కన్న నయా స్ట్రాటజీ వీడియో

” ఇద్దరూ నా ప్రాణాలు తోడేస్తున్నారు” వీడియో

ఎదురు తిరిగిన సంజనా.. నాగ్‌ సీరియస్! హౌస్‌ డోర్స్‌ ఓపెన్ వీడియో