అందాల ప్రపంచంలో ఎర్ర కలబంద ఖతర్నాక్‌ ఔషధం.. ఈ సమస్యలన్నీ ఖతమ్.. విషయం తెలిస్తే అసలు వదిలిపెట్టరు.!

|

Mar 12, 2024 | 9:19 AM

ఎరుపు కలబంద నిజానికి ఆకుపచ్చ కలబంద కంటే శక్తివంతమైనది. ప్రయోజనకరమైనది. దాని సాగు పరిమితంగా ఉండటం వల్ల కొంత ఖరీదు ఎక్కువ. కానీ దాని అనేక ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే, ఇది ఖచ్చితంగా ఆరోగ్యానికి సహజ సంజీవనిగా చెబుతారు. ఇందులోని సాలిసిలిక్ యాసిడ్, పాలీశాకరైడ్‌లు కండరాలను రిలాక్స్ చేసి వాపును తగ్గిస్తాయి. తలనొప్పి, మైగ్రేన్‌లతో బాధపడేవారికి ఇది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.

అందాల ప్రపంచంలో ఎర్ర కలబంద ఖతర్నాక్‌ ఔషధం.. ఈ సమస్యలన్నీ ఖతమ్.. విషయం తెలిస్తే అసలు వదిలిపెట్టరు.!
Red Aloe Vera
Follow us on

Red Aloe Vera Benefits: ఆకుపచ్చ కలబంద దాదాపు ప్రతి ఒక్కరి ఇళ్లలో కనిపిస్తుంది. కాబట్టి సాధారణంగా ఆకుపచ్చ కలబంద వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలుసు. కానీ ఆకుపచ్చ కలబంద కంటే ఎరుపు కలబంద ఎక్కువ ప్రయోజనకరమైనది అనే వాస్తవం చాలా మందికి తెలియదు. ఎరుపు రంగులో ఉండే ఈ మొక్క ఔషధ గుణాల కారణంగా కింగ్ ఆఫ్ అలోవెరాగా పేరు తెచ్చుకుంది. ఈ ఎర్ర కలబందలో విటమిన్ ఎ (బీటా కెరోటిన్), విటమిన్ సి మరియు ఇ, బి12 మరియు ఫోలిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షిస్తాయి. కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఎర్ర కలబంద ఆరోగ్య లక్షణాలు..

– గుండె ఆరోగ్యానికి మంచిది:

ఇవి కూడా చదవండి

ఎర్ర కలబందలో ఉండే సపోనిన్, స్టెరాల్ గుండెను రక్షిస్తాయి.

– అనాల్జేసిక్:

ఇందులోని సాలిసిలిక్ యాసిడ్, పాలీశాకరైడ్‌లు కండరాలను రిలాక్స్ చేసి వాపును తగ్గిస్తాయి. తలనొప్పి, మైగ్రేన్‌లతో బాధపడేవారికి ఇది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.

– చర్మానికి ఒక వరం:

ఎర్రటి కలబందలో ఉండే అధిక సాంద్రత కలిగిన జెల్ పొడి చర్మం, ముడతలు, మొటిమల నివారణకు ఉపయోగిస్తారు. నేషనల్ ఎగ్జిమా అసోసియేషన్ ప్రకారం, దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తామర నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా కాలిన గాయాలు, తగిలిన గాయాలు, సోరియాసిస్, కీటకాల కాటు, తల, చర్మం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిలోని కొల్లాజెన్ చర్మ యవ్వనాన్ని కాపాడుతుంది.

– షుగర్ కంట్రోల్:

డయాబెటిస్‌లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. టైప్ 2 డయాబెటిస్‌లో పరిమిత రూపంలో దీని వినియోగం ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఎరుపు కలబంద నిజానికి ఆకుపచ్చ కలబంద కంటే శక్తివంతమైనది. ప్రయోజనకరమైనది. దాని సాగు పరిమితంగా ఉండటం వల్ల కొంత ఖరీదు ఎక్కువ. కానీ దాని అనేక ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే, ఇది ఖచ్చితంగా ఆరోగ్యానికి సహజ సంజీవనిగా చెబుతారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి