ఎముకలను బలంగా మార్చే ఆహారం.. పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు దీన్ని మించిన సూపర్‌ఫుడ్ ఏదీ లేదు..
రాగుల్లో కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రాగి జావ, రాగి రొట్టె, రాగి సంకటి రూపంలో వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యానికి, జీర్ణక్రియకు, బరువు నియంత్రణకు మేలు కలగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎదిగే పిల్లలు, పోషకాహారం అవసరమైనవారికి కూడా రాగి మంచి పోషకాహార ఎంపికగా ఉపయోగపడుతుంది.

రాగులలో కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే.. రాగులను రెగ్యులర్‌గా తీసుకోవాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ఇవి శరీరానికి ఎంతో బలాన్నివ్వడంతోపాటు.. ఎముకలు బలపడటానికి సహాయపడుతాయి.. అంతేకాకుండా రక్తహీనత తగ్గడంతోపాటు.. మధుమేహం అదుపులో ఉంటుందని డైటీషియన్లు సూచిస్తున్నారు. అయితే.. రోజూ రాగి జావ లేదా సంకటి లేదా రొట్టెల రూపంలో తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయని.. పలు సమస్యలను కూడా నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రాగి జావ – రోటి ప్రయోజనాలు..
ఈ అద్భుతమైన రాగుల ఆహారం మన పూర్వీకుల కాలం నుండి సంప్రదాయ ఆహారంలో భాగంగా ఉంది. ప్రతిరోజు రాగి జావ లేదా రాగి రోటి ను తాగడం వలన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
రాగి జావలో అధికంగా ఉండే పోషకాలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా, రాగి జావలోని కాల్షియం ఎముకల సాంద్రతను పెంచి, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ముఖ్యంగా మహిళల ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం.
ఇందులో అధికంగా ఉండే డైటరీ ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని ఎక్కువసేపు ఉంచి, అనవసరమైన ఆహారం తీసుకోవడాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల బరువు నియంత్రణ సులభతరం అవుతుంది.
రాగులలోని అమైనో ఆమ్లాలు శరీరంలోని చెడు కొవ్వులను కరిగించే హార్మోన్ల ఉత్పత్తిని పెంచి, అధిక కొవ్వు చేరకుండా నిరోధిస్తాయి. ఈ జావలో పుష్కలంగా ఉండే ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి, రక్తహీనతను సమర్థవంతంగా నివారిస్తుంది. తద్వారా శరీరంలో శక్తి స్థాయిలు మెరుగుపడతాయి.
అంతేకాకుండా, రాగి జావలోని విటమిన్లు, ఖనిజాలు మెదడు ఆరోగ్యానికి దోహదపడి, నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి.
దీని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ మధుమేహ నియంత్రణకు సహాయపడుతుంది, రక్తంలో గ్లూకోస్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
రాగి జావ శరీర ఉష్ణోగ్రతను తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా శరీరానికి మంచి పోషకాలను అందిస్తుంది..
అయితే.. రాగి జావను ఉదయం సాయంత్రం వేళల్లో ఎనప్పుడైనా తీసుకోవచ్చు.. ఇంకా గోధుమ రొట్టెలకు బదులు రాగుల రొట్టెలను ఆహారంలో భాగం చేసుకోవచ్చు.. లేదా అన్నం బదులు వీటిని తినొచ్చు.. ఎదిగే పిల్లలకు, పోషకాహార లోపంతో బాధపడేవారికి రాగి జావ, రాగుల ఆహారం ఒక సమగ్రమైన, బలమైన ఆహారంగా పనిచేస్తుందని పేర్కొంటున్నారు ఆహార నిపుణులు..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
