సీతాఫలం.. ఒక పండు తిన్నా ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే వదలరు!

Samatha

19 september 2026

Pic credit - Pinterest

సీతాఫలం సీజన్ వచ్చేస్తోంది. ఈ సమయంలో చాలా మంది వీటిని తినడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు.

సీతాఫలం

కాగా, ఇప్పుడు మనం సీతాఫలం తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో, వివరంగా తెలుసుకుందాం.

ప్రయోజనాలు

ప్రతి రోజూ ఒక సీతాఫలం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది.

విటమిన్ సి

అందువలన ప్రతి రోజూ ఒక పండు తినడం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచి, జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్స్  రాకుండా కాపాడుతుందంట.

వైరల్ ఇన్ఫెక్షన్స్

అంతే కాకుండా సీతాఫలం గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, వంటి ఎక్కువగా ఉండటం వలన బీపీ తగ్గించి, గుండెకు మేలు చేస్తాయి.

గుండె ఆరోగ్యం

అలాగే సీతాఫలం జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. దీనిని తినడం వలన ఇది మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను తగ్గించి, జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది.

జీర్ణక్రియ ఆరోగ్యం

అంతే కాకుండా సీతాఫలంలో విటమిన్ బీ6 ఎక్కువగా ఉండటం వలన ఇది ఒత్తిడి, డిప్రెషన్ , మూడ్ స్వింగ్స్ తగ్గించి, మెదడు పనితీరును మెరుగు పడేలా చేస్తుంది.

మెదడు పనితీరు

అలాగే ఇది కంటి చూపు కూడా మెరుగు పడేలా చేస్తుంది. సీతాఫలంలో విటమిన్-A ఎక్కువగా ఉండటం వలన కంటి చూపు మెరుగుపడుతుంది.

కంటి చూపు