Ragi Malt: సమ్మర్ వచ్చేసింది.. రోజుకో గ్లాసు రాగిజావ తాగితే ఈ రోగాలు పరార్..! బిందాస్‌ ఆరోగ్యం ఖాయం..

రాగి జావ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అధిక ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది, కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ మధుమేహాన్ని నియంత్రిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచి, క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. ఇది శక్తినిచ్చి, మిమ్మల్ని ఉల్లాసంగా ఉంచుతుంది.

Ragi Malt: సమ్మర్ వచ్చేసింది.. రోజుకో గ్లాసు రాగిజావ తాగితే ఈ రోగాలు పరార్..! బిందాస్‌ ఆరోగ్యం ఖాయం..
Ragi Java

Updated on: Feb 18, 2026 | 2:03 PM

రాగుల్లో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి పెంచి రక్తహీనత ఏర్పడకుండా కాపాడుతుంది. రక్తం తక్కువగా ఉన్నవారు రోజూ రాగి జావ తాగితే మంచిది. రాగి జావ తాగడం ద్వారా మీ శరీరానికి కావాల్సినంత కాల్షియం అందుతుంది. తద్వారా ఎముకలు బలంగా ఉంటాయి. వయసు పెరిగినా ఎముకలు బలహీనపడకుండా కాపాడుకోవచ్చు. రాగి జావలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగులను హెల్తీగా ఉంచుతుంది. మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.

రాగి జావలో ఫైబర్ ఎక్కువగా, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. తద్వారా తొందరగా కడుపు నిండుతుంది. కొవ్వు కరుగుతుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది. రాగి జావలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. రోజూ ఉదయం ఓ గ్లాస్ రాగి జావ తాగితే రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. డయాబెటిస్ ముప్పు తగ్గుతుంది. రాగి జావలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతాయి. అలాగే ఇమ్యూనిటీ పెంచుతాయి. రోజూ రాగి జావ తాగితే అనేక ఇన్పెక్షన్ల నుంచి కాపాడుకోవచ్చు.

రాగి జావలో యాంటీ ఆక్సిడెంట్లు, అమోనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. కుదుళ్లకు బలాన్ని ఇచ్చి జుట్టును ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేస్తాయి. రాగి జావలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఉదయం పూట రాగి జావ తాగితే ఎనర్జీ రెట్టింపు అవుతుంది. అలాగే రోజంతా ఉల్లాసంగా ఉంటారు. రాగి జావలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదల అడ్డుకుంటాయి. తద్వారా పలు రకాల క్యాన్సర్లు రాకుండా కాపాడుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us